తహసీల్దార్లకు ‘ధరణి’ శిక్షణ.      

Date:27/10/2020

జగిత్యాల  ముచ్చట్లు:

ధరణి  పోర్టల్ ఈ నెల 29  తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో  జగిత్యాల జిల్లాలోని తహసీల్దార్లు మంగళవారం  ప్రభుత్వం ఇచ్చే శిక్షణ  కోసం హైదరాబాద్ తరలి వెళ్లారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లోని అనురాగ్ యూనివర్సిటీ లో  మంగళవారం ధరణి పోర్టల్ నిర్వహణ పై శిక్షణ కు వెళ్తున్న  తహశీల్దార్లను  జిల్లా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో అసంఘం గౌరవ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,అధ్యక్షుడు ఎండీ.వకీల్,కార్యదర్శి కృష్ణలు అభినందించారు.  ధరణి ఆధారంగా రిజిస్ట్రేషన్లు ఎలా చేయాలన్నదానిపై, తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం-2020తో పాటు న్యాయపరమైన అంశాలపై ఉదయం సమయంలో థియరీ క్లాసు,   మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంప్యూటర్‌పై ప్రాక్టికల్‌ శిక్షణ పొందుతారు. జగిత్యాల జిల్లా నుంచి  అన్ని మండలాల  తహశీల్దార్ లు ఈ శిక్షణకు  తరలి వెళ్లారు.

టీడీపీ కార్యాలయాన్ని  ప్రారంభించిన బి వి జయ నాగేశ్వర్ రెడ్డి

Tags; ‘Dharani’ training for tehsildars.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *