ఆర్మూర్ లో గెలుపుపై ధీమా…

 Date:13/04/2019

అనంతపురం ముచ్చట్లు :
అందరి చూపు తనవైపు తిప్పుకున్న నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఉత్కంఠకు తెరవీడింది. ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఇక అభ్యర్థుల భవితవ్యం ఈవియం యూనిట్లలో నిక్షిప్తమైంది. ఇదిలా వుంటే పోటీ చేసిన అభ్యర్థులు ఎవరికివారే అంచనాలు వేసుకుంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏవర్గాల నుంచి తమకు అనుకూలంగా ఓట్లు పడ్డాయో సన్నిహిత నేతలు, ఇతర వర్గాల నుంచి వివరాలను  సేకరిస్తు ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఇంతకీ నిజామాబాద్ పార్లమెంట్ లో నిలబడే పార్టీ ఎవరిది..ఎవరి అంచనాలు నిలబడుతాయి…ఎవరి అంచనాలు తలక్రిందులవుతాయి.…వాచ్ దిస్ స్టోరి…సార్వత్రిక ఎన్నికలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రశాంతంగా ముగిసాయి. ఎండనుసైతం లెక్కచేయకుండా ప్రధాన పార్టీల అభ్యర్ధులు ప్రచారం నిర్వహించారు. కౌంటింగ్‌కు 40 రోజుల సమయం ఉండడంతో అందరిలోను ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య ఎక్కువ రోజుల సమయం ఉండడంతో గెలుపోటములపైన ఆయా పార్టీలకు చెందిన నేతలు, ఇతర వర్గాలు బెట్టింగులు కాస్తున్నారు. తమ పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుస్తారని అంచనాకు వస్తున్నారు. ప్రస్తుతం తమ సన్నిహితులను పిలుచుకుని అంచనాకు వస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లకు అనుగుణంగా ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిస్థాయి పోలింగ్ సరళిని బట్టి ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో తమకు ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి అని ఒక అంచనాకు వస్తున్నారు.
ఈ ఎన్నికల్లో తమకు ఏ వర్గాలు అనుకూలంగా ఓట్లు వేశారు, ఏ వర్గాల నుంచి తమకుసహకారం అందలేదో అంచనా వేసి లెక్కకడుతున్నారు. ఈ దఫా యువతతో పాటు మహిళలు, మైనార్టీలు ఎక్కువ మంది ఓటు
హక్కు వినియోగించుకోవడం వల్ల ఆ ఓట్లు ఏ వైపు మొగ్గాయో ఒక పరిశీలనకు వస్తున్నారు. పార్టీ అనుకూలంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు వెనకబడి ఉన్న వాటిపైన కూడా చర్చిస్తున్నారు. అదికార పార్టీ నేతలు, రైతులు ఏవైపు మొగ్గారో పరిశీలిస్తున్నారు. ఎర్రజొన్న, పసుపు రైతులు ఏవైపు ఓట్లు వేశారు, రైతు అభ్యర్థులు వేసిన గ్రామాల్లో ఓట్లు ఏవైపు పడ్డాయి, రైతుబంధు పథకం, పింఛన్‌దారులు ఎటు వైపు మొగ్గారో పరిశీలిస్తున్నారు. బూత్‌ల ఆధారంగా ఒక అంచనాకు వస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నేతలు ప్రస్తుతం పూర్తిస్థాయిలో పనిచేశారా అనే అంశంపై ఆరాతీస్తున్నారు. ఎవరైన ఇతర పార్టీలకు సహకరించారా పరిశీలిస్తున్నారు. పోలైన ఓట్లు, తమకు వచ్చే మెజార్టీపైన ఒక అంచనాకు వచ్చి ధీమతో ఉన్నారు. ఇదే పరిస్థితి కూడా బీజేపీ, కాంగ్రెస్ అభ్య ర్థులలో ఉంది. బీజేపీ మొదటిసారిగా పుంజుకోవడంతో ఆ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తమకు ఉన్న సాంప్రదాయ ఓట్లతో పాటు రైతాంగం, ఇతర వర్గాల ఓట్లు కూడా కొంతమొత్తంలో పడడంతో అంచనా వేస్తున్నారు. కొన్ని సామాజిక వర్గాలు కూడా తమకు సహకరించడంతో ఆ ఓట్లు ఎన్నిఉంటాయో పరిశీలిస్తున్నారు. బీజేపీ అభ్యర్థికి వచ్చే ఓట్లపై అంచనా వేస్తు, తమకు అనుకూలంగా ఉన్న అంశాలను పరిశీలిస్తూ ఒక నిర్ణయానికి వస్తున్నారు. మొత్తం పోలైన ఓట్లలో తమకు ఎంతమేర కలిసివస్తాయో పరిశీలిస్తున్నా రు. మరోవైపు  కాంగ్రెస్ నేతలు కూడా ఒక అంచనాకు వస్తున్నారు. ప్రధాన నేతలు వలస పోయిన సాంప్రదాయ ఓటు తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. మైనార్టీ ఓట్లపైన ఒక అంచనాకు వస్తున్నారు. నియోజకవర్గం పరిదిలో తమకు పూర్వవైభవం వస్తుందని భావిస్తున్నారు. పార్టీ అభ్యర్థితో పాటు నేతలు ఒక అంచనా వేసుకుని పరిశీలిస్తున్నారు.
తమ సన్నిహిత వర్గాలు, నేతల ద్వారా పూర్తిస్థాయి అంచన వేయడంతో పాటు తమకు ఎన్ని ఓట్లు వస్తాయో బూత్‌ల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. అభ్యర్థులు పో లింగ్ ముగియడంతో ఈ అంచనాల్లో నిమగ్నమవగా ప్రధాన పార్టీల నేతలతో పాటు జిల్లాలోని ప్రజలు కూడా ఫలితాలపైన చర్చలు జరుపుతున్నారు. గత ఎన్నికల కన్న కొద్దిశాతమే తక్కువగా పోలింగ్ జరిగిన ఏ పార్టీ గెలుస్తుందోనని ఒక అంచనాకు వచ్చేప్రయత్నం చేస్తున్నారు.టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్లను సమీక్షిస్తూనే ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య నే భారీ పోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎవరికివారే కొన్నిచోట్ల బెట్టింగ్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితాలకు సమయం ఉండడంతో పార్లమెంట్ పరిధిలో ఈ విషయంపై మరింత  చర్చ జరుగుతుంది. మరోవైపు సీఎం కేసిర్  కూతురు కవిత అధికార పార్టీ తరపున అభ్యర్థిగా ఉండడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. బీజేపీ పుంజుకోవడం వల్ల కూడా బెట్టింగ్‌లపై ఈ అంచనాలు కొనసాగుతున్నాయి. జోరుగాగ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు ఇవి జరుగుతున్నాయి. ఈ చర్చకు పులిస్టాఫ్ పడాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే… అదే రోజు ఓటర్లు ఏవైపు మొగ్గారు. ఎవరికి మద్దతు ఇచ్చారో తేలనుంది.
Tags:Dharmasamy on victory in Armour …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *