వైన్ షాపు వద్దంటూ మహిళలను ధర్నా

Date:14/12/2019

సూర్యాపేట ముచ్చట్లు:

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని ద్వారక వైన్స్ ముందు మహిళలు  ధర్నాకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనావాసాల మధ్యనుంచి వైన్ షాప్ మార్చాలని  మహిళలు నినాదాలు చేసారు.   అంతే కాకుండా షాప్ లోని మద్యం బాటిల్స్, వాటర్ ప్యాకేట్స్ బయటకు విసిరివేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మహిళలు మాట్లాడుతూ  జనావాసాల మధ్యనే వైన్స్ దుకాణం ఉండటంతో  తాగుబోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని,  అర్ధరాత్రి వరకు మద్యం విక్రయిస్తున్నారని, మహిళలు బయకు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. షాప్ మార్చమని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసినా పట్టించుకున్న పాపానపోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయానికి, స్కూల్ కి మహిళలు, ఆడపిల్లలు వెళ్లలేని పరిస్థితి ఉందని, ఇప్పటికైనా  సంబంధిత అధికారులు  స్పందించి వైన్స్ షాప్ ను మార్చాలని, లేని పక్షంలో  ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు.

 

కూతుర్ని ప్రియుడి దగ్గరకు పంపించిన తల్లి

 

Tags:Dharna for women at the wine shop

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *