Natyam ad

చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల కై ఫిబ్రవరి  8న ఢిల్లీలో ధర్నా

గుంటూరు  ముచ్చట్లు:

చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల కై ఫిబ్రవరి  8న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బారి  ధర్నాను నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రీ వేణుమాధవ్ తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు తెలిపారు. చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు,బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్లు,కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ,బీసీ కుల గణన,బీసీలకు క్రిమిలేయర్ తొలగించాలి పైడిమాండ్లపై రెండు రోజుల ఢిల్లీ ప్రోగ్రాం కలదు కావున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు ఈ కార్యక్రమాలకు హాజరవుతారని తెలిపారు.అలాగే ఫిబ్రవరి 9 రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

Tags: Dharna in Delhi on February 8 for 50% reservation for BCs in the Legislative Assembly

Post Midle
Post Midle