కంది రైతులకు మద్దుతుగా ధర్నా

Date:16/09/2020

కొడంగల్  ముచ్చట్లు:

కొడంగల్ నియోజకవర్గంలో కంది రైతులకు మద్దతుగా 73లక్షల అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులను అరెస్ట్ చేయాలని కోరుతూ  కాంగ్రెస్ పార్టీ  నేతలు ధర్నాకు దిగారు.  వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో జనవరి నెలలో మార్కుఫెడ్ సంస్థ డీసీఎంఎస్  ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ వాల్టీకీ 126 మంది రైతులకు అమ్ముకున్నా,  పంటకు డబ్బులు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో కొడంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కొడంగల్ ప్రాంతానికి చెందిన ఎమ్యెల్యే అనుచరుడు  కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ మిగతా ఇద్దరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్ లతో కందులను అమ్మకపోయినా  అధికారులతో కుమ్మకై డబ్బులు 73 లక్షల అక్రమంగా దారి మళ్లించారని అందువల్ల 126 మంది  రైతులకు నేటికి డబ్బులు అందలేదని  న్నారు. అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.  అనంతరం కొడంగల్ తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

మహిళలకు ఆసరా అండగా నిలిచింది

Tags: Dharna in support of sorghum farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *