Dharna of cotton farmers

పత్తి రైతుల  ధర్నా

Date:05/12/2019

నిర్మల్ ముచ్చట్లు:

మిల్లుల కు తీసుకువచ్చిన పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలంటూ పత్తి రైతులు ఆందోళనకు దిగారు, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ జిన్నింగ్ ముందుగల జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు, సిర్గాపూర్ లోని జిన్నింగ్ మిల్లులు కు పత్తి అమ్మేందుకు వస్తే సీసీఐ అధికారులు నిర్మల్లోని మరో జిన్నింగ్ మిల్లులో కొనుగోలు చేస్తున్నారని, అక్కడికి తీసుకువెళ్లాలని సూచించారని రైతులు వాపోయారు.సీసీఐ అధికారులు ఓకే వ్యాపారికి వత్తాసు పలుకుతూ అదే జిన్నింగ్ మిల్లులో కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో తమకు భారం ఎక్కువ అవుతుందని, సి సి ఐ అధికారులు సిర్గాపూర్ లో సైతం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ఇక్కడ ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైతులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ పత్తిని కొనుగోలు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు  కూర్చున్నారు. విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ అధికారులు చేరుకొని రైతులను సముదాయించడం తో పరిస్థితి సద్దుమణిగింది.

 

ఉపాధ్యాయుల ధర్నా

 

Tags:Dharna of cotton farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *