మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
విశాఖపట్నం ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి పై మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. పిఆర్సి ప్రకటన లోపభూయిష్టంగా ఉందని , కాంట్రాక్ట్ కార్మికులకు ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులోభాగంగా సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సుబ్బారావు, వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, ఎన్జీవోలు తమ స్వార్థం చూసుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులకు పి ఆర్ సి అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Dharna of Municipal Contract Workers