సంకెపల్లి గ్రామస్థుల ధర్నా

వేములవాడ  ముచ్చట్లు:

వేములవాడ అర్బన్ మండలం కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై సంకెపల్లి గ్రామస్థుల ధర్నా కుదిగారు. దాంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అధికారులు తమ సమస్యలను తీర్చడం లేదంటూ వేములవాడ అర్బన్ మడలం సంకెపల్లి గ్రామస్తులు వేములవాడ-కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మిడ్ మానేరు లో సర్వం  కోల్పోయిన తమకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని ఇండ్ల పట్టాలు రాలేదు అని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించికోవడం లేదని, తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని  డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ సిఐ వెంకటేష్ సంఘటన స్థలానికి చేరుకొని ధర్నా విరమించాలని కోరారు. అయిన గ్రామస్తులు కీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ధర్నా విరమించేది లేదని స్పష్టం చేసారు. దాంతో తహశీల్ధార్ మునిందర్ చేరుకొని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వగా ధర్నా విరమించారు .

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:Dharna of Sankepalli villagers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *