ఆసుపత్రిముందు మహిళా సంఘాల ధర్నా

Date:27/10/2020

పిలేరు  ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పీలేరు లోని నోబుల్ నర్సింగ్ హౌమ్ ని రద్దు చేయాలని మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. ఈ ప్రైవేటు ఆసుపత్రులలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ జరుగుతుంది. లింగనిర్ధారణ లో ఆడపిల్ల అని తెలిస్తే ఆభాషన్ చేయడానికి సిద్దమని మహిళలు ఆరోపిస్తున్నారు.  నోబుల్ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ జరుగుతుందని తెలిసి డెప్యూటీ డీఎంహెచ్వో  లోకవర్థన్ ఇటీవల తనీఖీలు నిర్వహించారు. లింగ నిర్ధారణ కోసం వచ్చిన మహిళ స్వయంగా లింగనిర్ధారణ కోసం వచ్చానని చెబుతున్న విచారణను  అయన దాటవేసే ప్రయత్నం చేసారని వారు ఆరోపించారు. మిగతా అంతా విచారణలో  తెలుస్తుంది,అటు తరువాత మీడియా కు తెలియచేస్తాం అంటూ మాట దాటే పారి వారు విమర్శించారు. ఈవిషయం  తెలుసుకోన్న  మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. నోబుల్ నర్సింగ్ హౌమ్ ని రద్దుచేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. గతంలో లింగనిర్ధారణ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నర్సింగ్ హోమ్ సీజ్ చేసారు. తీరు మారలేదని వారు విమర్శించారు. ప్రభుత్వం ప్రతి గ్రర్భణీ కు నెలకు 800 ఖర్చు పేడుతు వుంటే,  ఇలాంటి డాక్టర్లు కడుపులో నే బిడ్డని చంప్పేస్తున్నారని ఇలాంటీ వారిని ఊరి తీయాలని వారన్నారు. అంగన్వాడీ యునియన్  కార్యదర్శి చిన్నక్క మాట్లాడుతూ ఇలాంటి వారిని నడి రోడ్డుపై ఊరితీయాలని ఇలాంటి వారిని అరెస్టు చేయకపోతేలో ఉద్యమం  చేస్తామని అన్నారు.

టీడీపీ కార్యాలయాన్ని  ప్రారంభించిన బి వి జయ నాగేశ్వర్ రెడ్డి

Tags; Dharna of women’s associations in front of the hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *