పుంగనూరు ముచ్చట్లు:
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ సోమవారం అన్నమయ్యజిల్లా సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నట్లు మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ఆర్.అశోక్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమన్నారు. పార్లమెంటుకు, రాష్ట్రపతికి సంబంధం లేకుండ ఆర్టీకల్ 341 (1)ని సవరించకుండ తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా మాలమహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉధ్యమాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు పున ఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ తీర్పుతో మాలలకు తీరని ద్రోహం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు మాలలు ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు, నాగరాజ, రమేష్, ఆనంద, రెడ్డెప్ప , ఈశ్వర్, శీన తదితరులు పాల్గొన్నారు.
Tags: Dharna on 5th over the Supreme Court verdict