నక్కబండలో నీటి కోసం రోడ్డుపై ధర్నా

Dharna on the road for water in Nakkabanda

Dharna on the road for water in Nakkabanda

Date:15/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణ సమీపంలోని నక్కబండలో సుమారు 1372 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ గత ఇరవై ఐదు రోజులుగా మంచినీరు లేకపోవడంతో ప్రజలు ఖాళీ బిందెలతో సోమవారం జాతీయ రహదారిపై బైఠాయించి, ధర్నా చేశారు. పట్టణ దళిత సంఘ నాయకుడు రాజు ఆధ్వర్యంలో మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ బోరు చెడిపోవడంతో ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతున్నారని, ట్యాంకర్లను కూడ పంపడం లేదని , అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయాన్ని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేస్తామన్నారు. రహదారిపై ట్రాఫిక్‌ స్తంబించడంతో ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి ఆందోళన కారులతో చర్చలు జరిపారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరింపచేస్తామని హామి ఇవ్వడంతో ధర్నా విరమించారు.

రోటరీక్లబ్‌ ద్వారా విశిష్ఠ సేవలందిస్తాం

Tags; Dharna on the road for water in Nakkabanda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *