కోదాడలో వీఆర్ఏ సమస్యలు పరిష్కరించాలని ధర్నా

సూర్యాపేట ముచ్చట్లు:

కోదాడ తహశీల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ జేఏసీ సంఘం అధ్వర్యంలో మూడు రోజులనుండీ నిర్వహాధిక సమ్మె నిర్వహిస్తున్నారు.  కోదాడ వీఆర్ఏ లు, ఈ సందర్భంగా పలువురు వీఆర్ఏ లు మహిళలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ 2017 న ప్రగతి భవన్ లో,2020 అసెంబ్లీలో,2022 కూడా అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రం లో గల23,000 వేల మంది వీఆర్ఏ లందరికీ పెస్కేల్ అర్హత కలిగిన ప్రతి వీఆర్ఏ లకు ప్రమోషన్, 55 సంత్సరకాలం పై  బడిన వీఆర్ఏ వారుసులకు ఉద్యోగ అవకాశాలు కలిపిస్తామని హామీలు ఇచ్చినారు. హామీలు నెరవేర్చకుండా కెసిఆర్ తమపై చిన్న చూపు చూస్తూ  పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.సీ సీ ఎల్ ఏ కు వెళ్లి అడగగా ఎటువంటి సమాచారం ఇచ్చేవారే లేరని,తమ వీఆర్ఏ ల బ్రతుకులు  తమ కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని తెలియజేశారు. మహిళలకు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వలేని దుర్భర పరిస్థితి ఉందని, దయచేసి తమ పై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి వి ఆర్ ఏ కుటుంబాలకు బరోసాను కల్పిస్తూ, తమకు న్యాయం చేయాలని కోరుతున్నాము.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ ను వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రెడ్డి, శేఖర్, బందగి,సునీత కోటి, స్నేహ, షాహిదా,సుధా, సుకన్య,  వీఆర్ఏ లు పాల్గొన్నారు.

 

Tags: Dharna to resolve VRA issues in Kodada

Leave A Reply

Your email address will not be published.