ఖాళీ బిందెలతో ధర్నా

హైదరాబాద్ ముచ్చట్లు:

సింగరేణి గుడిసెలలో  రూపాయికే మంచి నీటి కనెక్షన్లు ఇవ్వాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో గుడిసేవాసులు  ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఐ.ఎస్ సదన్ డివిజన్ లోని సింగరేణి కాలనీ గుడిసెవాసులు తాగునీటి కోసం తిప్పలు పడుతున్నారు. ఇక్కడ 13 వేల కుటుంబాలు 25 ఏళ్లుగా నివసిస్తున్నాయి. ఇందులో అత్యధిక శాతం గిరిజన కుటుం బాలే. ప్రభుత్వం మురికివాడలు, బస్తీలలో రూ.1కే నల్లా పధకం ప్రవేశపెట్టి గ్రేటర్లో అన్ని ప్రాంతాలలో కనెక్షన్లు. ఇచ్చి ఉచిత నీటి సరఫరా చేస్తోంది. కానీ సింగరేణి గుడిసెలలో కోర్టు తీర్పు సాకుతోమంచినీటి కనెక్షన్లు ఇవ్వకపోవ డంతో జలమందలి ఉచిత ట్యాంకర్లే వారికి దిక్కుగా మారాయి. రెండు రోజులకొకసారి వచ్చే ట్యాంకర్ ఇంటికి ఒక డ్రమ్ము నీటిని అందిస్తున్నారు. డ్రమ్ములే పోసిన నీటిని మోటర్లను బిగించి ఇళ్లకు పైప్ల ద్వారా నీటిని తరలిస్తు న్నారు.
జలమండలి ఆదాయానికి గండి
వైశాలీనగర్ రిజర్వాయర్ నుంచి సింగరేణి గుడిసెవాసులకు నిత్యం 100-120 ట్యాంకర్ల ద్వారా ఉచితంగా మంచి నీటి సరఫరా చేస్తున్నారు. దీని ద్వారా సుమారు రూ.10 నుంచి రూ. 12 లక్షలు ట్యాంకర్ల యాజమానులకు జలమం డలి అధికారులు చెల్లిస్తున్నారు. రూ.20 లక్షల వ్యయంతో గుడి ప్రాంతంలో తాగునీటి కనెక్షన్లు ఇస్తే మంచినీటి సమస్య తీరుతుంది. దీంతో జలమండలికి ఆదాయం మిగు లుతుంది. కానీ, ఆదిశగా చర్యలు తీసుకోకుండా. కోర్టు తీర్పు సాకుతో నీటి కనెక్షన్లు ఇవ్వకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Dharna with empty bins

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *