Natyam ad

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో  మధుమేహ నిర్ధారణ పరీక్షలు  

వేములవాడ ముచ్చట్లు:

వేములవాడ లయన్స్ క్లబ్  ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో బుధవారం  మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వేములవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ రాపెళ్లి శ్రీధర్ తెలిపారు .ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ  వ్యాధి ప్రారంభ లోనే గుర్తిస్తే  అవసరమైన జాగ్రత్తలు పాటించాలి నియంత్రించడం సులభంగా ఉంటుందన్నారు. ఉచిత మధుమేహ  వ్యాది నిర్దారణ పరీక్షలు నిర్వహించి మధుమేహ వ్యాధి వచ్చిన పేషంట్ లకి ఉచిత కన్సల్టెంట్ కొరకు మాతృషి హాస్పటల్ పంపించడం జరిగింది.బుధవారం  దాదాపు 60 మందికి పైగా టెస్టు చేయడం జరిగింది ఈ మధుమేహ   క్యాంప్ నవంబర్ నెలలో 30 రోజులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు .నేడు గబుధవారం రోజున కోరుట్ల బస్టాండ్ వద్ద మధుమేహ వ్యాధి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు .ఈ కార్యక్రమం నిర్వహించిటకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.    ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగ రమేష్, కార్యదర్శి,ఎరవెల్లి రాజశేఖర్, సామవిర రమణయ్య,రఘుపతి రావు  పాల్గొన్నారు.

 

Tags: Diabetic screening tests under the auspices of the Lions Club

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.