డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

Date:06/09/2019

తిరుమల ముచ్చట్లు:

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో  అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు :

– సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబ‌రు 20లోపు ఇంజినీరింగ్ ప‌నులు పూర్తి చేస్తాం.

ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు :

– బ్రహ్మోత్సవాల్లో ఆలయంలో శ్రీవారి దర్శనంతోపాటు వాహనసేవలను తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాం. విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలు ప్రొటోకాల్ ప్ర‌ముఖుల‌కే ప‌రిమితం.

– సెప్టెంబరు 29(అంకురార్పణం) నుండి అక్టోబరు 8వ తేదీ వరకు వయోవృద్ధులు, దివ్యాంగులు, ఏడాదిలోపు పిల్లల తల్లిదండ్రులకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలు రద్దు.

– సెప్టెంబరు 28 నుండి అక్టోబరు 10వ తేదీ వరకు టిటిడిలోని వివిధ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రత్యేక దర్శనాలు, గదులు రద్దు.

– బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయింపు.

– అక్టోబరు 4న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 2 నుండి 4వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదు.

– ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని విఐపిలు, భక్తులు టిటిడికి సహకరించాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం.

అన్నప్రసాద వితరణ :

– సాధారణ రోజుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.

– బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుండి రాత్రి 11.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తాం.

– గరుడ సేవనాడు రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.

దర్శనం :

– గతేడాది ఆగ‌స్టులో 19.16 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది ఆగ‌స్టులో 24.02 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

హుండీ ఆదాయం :

– శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది ఆగ‌స్టులో రూ.84.05 కోట్లు కాగా, ఈ ఏడాది ఆగ‌స్టులో రూ.113.71 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం :

– గతేడాది ఆగ‌స్టులో 43.32 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది ఆగ‌స్టులో 52.73 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.

లడ్డూలు :

– గతేడాది ఆగ‌స్టులో 81.52 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది ఆగ‌స్టులో 1.12 కోట్ల లడ్డూలను అందించాం.

గ‌దులు :

– గ‌దుల ఆక్యుపెన్సీ గతేడాది ఆగ‌స్టులో 93 శాతం న‌మోదు కాగా, ఈ ఏడాది ఆగ‌స్టులో 104 శాతం న‌మోదైంది.

 

ఆన్‌లైన్‌లో 68,466 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :

Tags: Dial Your Evo Highlights

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *