కుమారస్వామి భార్య హీరోయిన్ అనే విషయం తెలుసా?

Did Kumaraswamy's wife know the heroine?

Did Kumaraswamy's wife know the heroine?

Date:20/05/2018

బెంగళూరు ముచ్చట్లు:

ఒకవైపు జేడీఎస్ నేత కుమారస్వామి కర్నాటక సీఎంగా పదవీ ప్రమాణంచేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అతని భార్య రాధికా కుమారస్వామికి సంబంధించిన వార్తలు గూగుల్‌లో ట్రెండింగ్‌గా మారాయి. రాధికాకుమార స్వామి కన్నడనాట ప్రముఖ నటి. ప్రొడ్యూసర్‌గానూ పేరొందారు. కుమారస్వామికి 58 ఏళ్లు, అతని భార్య రాధికా కుమారస్వామికి 31 ఏళ్లు. 2005లో కుమార స్వామికి రాధిక పరిచయమయ్యారు. 2010లో రాధిక స్వయంగా తాను 2006లో జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామిని వివాహం చేసుకున్నానని వెల్లడించారు. వీరిద్దరికీ షమికా కుమారస్వామి అనే కుమార్తె ఉంది. కాగా వీరిద్దరికీ ఇది రెండవ వివాహం. కుమారస్వామి 1986లో అనితను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ నిఖిల్‌గౌడ అనే కుమారుడున్నాడు. మరోవైపు రాధిక 2002లో రతన్ కుమార్ ను వివాహం చేసుకున్నారు. రాధిక ఇంతవరకూ 32 సినిమాల్లో నటించారు. తమిళ సినిమాల్లోనూ రాధిక ప్రతిభ చూపారు. ప్రస్తుతం రాధికా కుమారస్వామి సినిమా నిర్మాతగా కొనసాగుతున్నారు.

 

Tags; Did Kumaraswamy’s wife know the heroine?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *