పెళ్లయనా ఐదు రోజులకు ఏం చేసిందో తెలుసా..

Date:20/07/2018
చెన్నై ముచ్చట్లు:
ఆ జంటకు ఐదు రోజుల క్రితమే పెళ్లయ్యింది. ఇద్దరూ చిలకగొరింకల్లా చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కొత్త పెళ్లికూతురు భర్తను పట్టుకొని చితకబాదేసింది. చుట్టూ జనం ఉన్నారని కూడా మర్చిపోయింది.. చొక్కా పట్టుకొని దుమ్ము దులిపేసింది. తర్వాత స్థానికులు ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. భర్తను కొట్టడానికి కారణం ఓ పచ్చబొట్టని తెలిసి అందరూ తెగ నవ్వుకున్నారట. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన.మెట్టుపాళయంకు చెందిన ఈ జంటకు ఇటీవల వివాహం ఘనంగా జరిగింది. రెండు రోజుల క్రితం ఇద్దరూ బయటకెళ్లేందుకు బస్టాప్‌లో వెయిట్ చేస్తున్నారు. ఇద్దరూ పక్కపక్కనే నిల్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో భర్త చేతిపై ఓ పచ్చబొట్టు కనిపించింది. అది ఓ అమ్మాయి పేరు. ఆ పేరు ఎవరిదా అని ఆరా తీస్తే.. మనోడికి గతంలో ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉందని తేలింది. ఈ విషయం తెలియగానే భార్యకు కోపం కట్టలు తెంచుకుంది. భర్త చొక్కా పట్టుకున్న భార్య చెంప చెళ్లుమనిపించింది. జుట్టు పట్టుకొని నాలుగు పీకింది. కిందపడేసి చెడామడా వాయించింది. చుట్టూ ఉన్న జనం ఇదంతా చూసి షాకయ్యారు. కొంతమందైతే ఈ కామెడీ సీన్‌ను మొబైల్‌లో రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారడంతో పోలీసుల దగ్గరకు కూడా చేరిందట. వాళ్లు ఎవరా అని ఆరాతీస్తే వివరాలు తెలిశాయట. ఆమెకు గతంలో వివాహంకాగా భర్త నుంచి విడిపోయింది. ఓ బిడ్డకూడా ఉండగా.. ఇప్పుడు మళ్లీ ఆ యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుందట. మొత్తం మీద ఓ పచ్చబొట్టు కాపురంలో నిప్పులు పోసిందన్నమాట.
పెళ్లయనా ఐదు రోజులకు ఏం చేసిందో తెలుసా..https://www.telugumuchatlu.com/did-you-know-what-pellayana-did-for-five-days/
Tags: Did you know what Pellayana did for five days?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *