డీజిల్ కొరత

ఇల్లందు ముచ్చట్లు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పెట్రోల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా బంకుల్లో డీజిల్ లేకపోవడంతో వాహనదారులు ఉదయం నుండి సాయంత్రం దాకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయ సీజన్ మొదలైన నందున రైతులు తమ టాక్టర్ లకు డీజిల్ కోసం పెద్ద పెద్ద క్యాన్లతో పెట్రోల్ బంకుల ముందు బారులు తీరి ఉన్నారు. అయితే పెట్రోల్ బంకు ఈ సాయంత్రం ట్యాంకరు రావడంతో డీజిల్ కోసం రైతులు ఇతర వాహనదారులు  గంటల తరబడి లైన్ లో  నిలబడి ఉన్నారు. పెట్రోల్ బంకులు వాహనదారుల తో కిక్కిరిసి పోతున్నాయి. గందరగోళ పరిస్థితి ఉంది. కొన్ని బంకు లకు అసలు డీజిల్ లేదు. నో స్టాక్ బోర్డు పెట్టారు. దీంతో డీజిల్తో నడిచేటువంటి వాహనాలు ఎక్కడికక్కడ గా నిలిచి పోవడం వలన వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఉక్రెయిన్ యుద్ధం, గత రెండు రోజుల క్రితం జరిగిన ఆర్మీ అభ్యర్థుల ఆందోళన ఫలితంగా రైళ్ల దగ్ధం చేసిన  సంఘటన వలన రవాణా నిలిచిపోయి ఫలితంగా డిజిల్ కూడా సప్లై కావడం లేదని  ఇల్లందు పెట్రోల్, డీజిల్ బంక్ యజమాని సతీష్ తెలిపారు.

 

Tags: Diesel shortage

Post Midle
Post Midle
Natyam ad