అసమర్ధులకు టిక్కెట్లు కష్టమే

Date:16/04/2018
విజయవాడ  ముచ్చట్లు:
ఏపీలో అధికారంలోకి రావాలని వైసీపీ పగటి కలల కంటోందని ఎద్దేవా చేశారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అమరావతికి వచ్చిన ఆయన రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారం వస్తుందని జగన్, విజయసాయిరెడ్డి ఆశతో ఉన్నారని… అది సాధ్యమయ్యే అవకాశం లేదన్నారు. అలాగే జగన్, పవన్‌ను కలిపేందుకు ఢిల్లీలో కొంతమంది ప్రయత్నిస్తున్నారని… అది అసాధ్యమని వ్యాఖ్యానించారు. ఇద్దరూ సీఎం పదవి కోరుకుంటున్నప్పుడు ఎలా కలుస్తారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, లోకేష్ అవినీతి చేశారని కొందరు మాట్లాడుతున్నారని… వారు ఏం అవినీతి చేశారని విచారణ జరుపుతారని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో కూడా విచారణలు జరిపారని… వాటి వల్ల ఏం సాధించారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికలు. పార్టీల్లో చేరికలపైనా జేసీ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో అవినీతి పరులు, సమర్థంగా పనిచేయని వాళ్లకు… టీడీపీలో టిక్కెట్లు రావన్నారు. పనిచేయని వారికి సీట్లు నిరాకరించే ధైర్యం చంద్రబాబుకు ఉందన్నారు. అలా రాని వాళ్లు చివరి నిమిషంలో వైసీపీ వెళాతరని… అప్పటి వరకు వారు వెయిట్ చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి వెళాతారా అని ప్రశ్నించారు జేసీ.
Tags:Difficult for tickets to inaccuracies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *