క్యాబ్ డ్రైవర్లకు కష్టాలు

హైదరాబాద్ ముచ్చట్లు:


కరోనా మహమ్మారి అన్ని రంగాలను ఆగం..ఆగం చేసింది. కరోనా ఎంట్రీతోనే క్యాబ్ డ్రైవ‌ర్ల బతుకు బండికి బ్రేకులు ప‌డ‌గా..  లాక్‌డౌన్‌తో వారి జీవితాలు పూర్తిగా రోడ్డునప‌డ్డాయి. మరో వైపు పెరుగుతున్న ఇంధన ధరలు అందరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో ఇబ్బందులు పడుతున్నట్లు ఉబర్‌ డ్రైవర్లు కౌన్సిల్‌ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. సంస్థ కోసం కష్టపడుతున్న డ్రైవర్ల ఆచరణీయమైన, ఆకర్షణీయంగా ఉండేందుకు కృషి చేస్తాం. అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు భూషణ్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. రైడ్ క్యాన్సిలేషన్ అనేది ప్రయాణికుల్లో ప్రధాన సమస్య. అందుకే డ్రైవర్‌లు ప్రయాణికుల రైడ్‌ను అంగీకరించేందుకు వాళ్లు ఎక్కడ ఉన్నారనే విషయాల్ని చూపించేలా ఉబెర్‌ కొత్త ఫీచర్‌ను యాడ్‌ చేసింది అని ఉబెర్‌ పేర్కొందిఇటీవల సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అధారిటీ (సీపీపీఏ) రైడ్‌ షేరింగ్‌ సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. రైడ్‌ క్యాన్సిలేషన్‌, క్యాన్సిలేషన్‌ ఛార్జీలు,ర్యాండమ్‌గా పెరుగుతున్న ధర, ప్రయాణికులు క్యాబ్‌ కోసం ఎదురు చూడటం, డ్రైవర్లు ట్రిప్పులను రద్దు చేయమని ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టడం’ వంటి  ప్రయాణికులకు తలెత్తున్న సమస్యల్ని పరిష్కరించాలని హెచ్చరించింది. అదే సమయంలో క్యాబ్ అగ్రిగేటర్‌లను రైడ్ క్యాన్సిలేషన్‌లు, డీ ఫాల్ట్‌గా (యాధృచ్చికంగా) పెరుగుతున్న ఛార్జీలకు సంబంధించిన అల్గారిథమ్‌ల మార్చాలని తెలిపింది. కస్టమర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఉబెర్, ఓలాతో సహా ఇతర రైడ్‌ షేరింగ్‌లకు సంబంధించిన అల్గారింథమ్‌లను మార్చేందుకు 30రోజుల సమయం ఇచ్చింది.తమ బండి చ‌క్రం క‌ద‌ల‌క‌పోవ‌డంతో.. ఫైనాన్స్ కంపెనీలకు కిస్తీలు క‌ట్టలేక.. అటు కుటుంబాన్నీ సాదుకోలేక అల్లాడుతున్నారు క్యాబ్‌ డ్రైవర్లు. దీంతో త‌మ‌ను ఆదుకోవాలంటూ..

 

 

 

స‌ర్కార్‌ను వేడుకుంటున్నారు.కోవిడ్ మ‌హ‌మ్మారి ఎన్నో జీవితాల‌ను ఆత‌లాకుత‌లం చేస్తోంది. గ‌తేడాది క‌రోనా పుట్టింది మొద‌లు.. అన్నీ రంగాల‌ను ప‌ట్టి పీడిస్తోంది. ఆయా రంగాల‌పై ఆధారప‌డ్డ కుటుంబాలను పీల్చిపిప్పిచేస్తోందీ వైరస్‌. క‌రోనా దెబ్బకు క్యాబ్‌లు ఆగిపోయాయి. దీంతో వాటిపై ఆదార‌ప‌డ్డ కుటుంబాలు ఇప్పుడు ఉపాధి కరువైంది. ఒక్క హైద‌రాబాద్‌లోనే ల‌క్షన్నర‌కు పైగా క్యాబ్‌ల‌పై ఉపాధి పొందుతున్నారు. వీరంద‌రి జీవితాల‌ను క‌రోనా క‌క‌లావిక‌లం చేసింది. ఓలా, ఊబ‌ర్, ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై ఆధార‌ప‌డి బ‌తుకుతున్న వారిని రోడ్డునపడేసింది.లాక్‌డౌన్‌తో క్యాబ్ డ్రైవర్ల ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింది. ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ కంప‌నీల నుండే క్యాబ్‌ డ్రైవర్లకు ఉపాధి లభిస్తోంది. క‌రోనాతో ఫ‌స్ట్ వేవ్ నుంచే సాఫ్ట్‌వేర్ కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోమ్ డ్యూటీస్ అమ‌లు చేస్తూ వస్తున్నాయి. దీంతో అన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు త‌మ కంపెనీల్లో క్యాబ్‌ల‌ను తొలగించాయి. దీంతో ఆ క్యాబ్ ఓన‌ర్లు, డ్రైవ‌ర్లకు ఉపాధి లేకుండా పోయింది. క్యాబ్‌లు నడిపే వారిలో.. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని సొంతంగా న‌డుపుకునే వారు ఎక్కువ‌. లాక్‌డౌన్‌తో క్యాబ్‌లు ఆగిపోవ‌డంతో.. ఫైనాన్స్‌ కంపెనీలకు నెలవారీ కిస్తీలు కట్టలేకపోతున్నారు. దీనికి తోడు ఉపాధి కూడా లేకుండా పోవ‌డంతో.. ఇంటి అద్దెలు క‌ట్టలేని ప‌రిస్థితి.లాక్‌డౌన్‌తో ఉన్న ఉపాధికి గండి ప‌డ‌టంతో.. క్యాబ్‌లపైనే ఆధారపడ్డ కుటుంబాలు ఇప్పుడు రోడ్డున్న ప‌డ్డాయి.

 

Post Midle

Tags; Difficulties for cab drivers

Post Midle
Natyam ad