మల్బరీ రైతులకు కష్టాలు

కడప ముచ్చట్లు :

 

పట్టు రైతును కరోనా వైరస్‌ పీల్చిపిప్పిచేస్తోంది. కర్ఫ్యూ, ఆంక్షలతో పెళ్లిళ్లు, వేడుకలు, పండుగలు ఇతర శుభకార్యాల నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. పట్టువస్త్రాలు, ఇతర గార్మెంట్స్‌ వినియోగం సగానికిపైగా తగ్గిపోయింది. ఫలితంగా రాష్ట్రంలో మల్బరీ సాగుపై ఆధారపడిన రైతుల కుటుంబాలు అప్పుల అగాధంలోకి కూరుకుపోయాయి.రాష్ట్రంలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెద్దఎత్తున మల్బరీ పంట సాగవుతోంది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా లక్ష ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 70 వేల ఎకరాలు, కడప, కర్నూలు జిల్లాల్లో 3,500 ఎకరాల్లో మల్బరీ పంట సాగవుతోంది. ఇక్కడ సిబిఐ, బైవోల్టెన్‌ రకపు పంటలను ఎక్కవగా సాగు చేస్తున్నారు. కడప జిల్లాలో ఎకరా సాగుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కోతకు 250 కిలోల పట్టుగూళ్ల చొప్పున, ఐదు కోతలకు సుమారు 1,520 కిలోల పట్టు గూళ్ల దిగుబడి వస్తుంది. ప్రతి రైతుకూ సాధారణ రోజుల్లో ఏడాదికి ఐదు కోతల్లో రూ.80 వేల ఆదాయం లభించేది. మల్బరీ రైతులు గూళ్ల దశకు చేరుకున్న పట్టును తోటల్లోని షెడ్ల నుంచి స్థానిక మార్కెట్‌లైన మదనపల్లి, కదిరి, హిందూపురం మార్కెట్లకు తరలించేవారు.

 

 

 

 

ఇక్కడికి బెంగళూరు, చెన్నై ప్రాంతాల నుంచి రీలర్లు వచ్చి పట్టుగూళ్లను పెద్దఎత్తున కొనుగోలు చేసేవారు. కిలో పట్టుగూడు రూ.450 చొప్పున కొనుగోలు చేసేవారు. దేశంలో కరోనా రెండోదశ విజృంభించడంతో కొన్ని రాష్ట్రాలులాక్‌డౌన్‌, కర్య్ఫూలు విధించారు. మన రాష్ట్రంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు మార్కెట్లలో వ్యాపార కార్యకలాపాలు పరిమితమైన నేపథ్యంలో బెంగళూరు, చెన్నై పాంతాల నుంచి రీలర్లు రాకపోవడంతో స్థానిక వ్యాపారులే దిక్కుగా మారారు.కిలో స్థానిక సిబిఐ రకం రూ.300 ధర పలకాల్సి ఉండగా, రూ.150 పలుకుతోంది. విదేశీ రకపు బైవోల్టెన్‌ రకం పట్టుగూడు రూ.450 పలకాల్సి ఉండగా రూ.200 తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఫలితంగా ప్రతి మల్బరీ రైతూ సగానికిపైగా ధరను కోల్పోవాల్సి వస్తోంది. ప్రతిరైతూ సగటున రూ.40 వేల వరకు ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Difficulties for mulberry farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *