Natyam ad

పసుపు బోర్డుకు కష్టాలు

నిజామాబాద్ ముచ్చట్లు:
 
రాష్ట్రంలో పసుపుబోర్డు ఏర్పాటు రైతు సంక్షేమం కోసం కాకుండా రాజకీయ అజెండాగామారింది. పార్టీలకు ఆయా ఎన్నికల్లో ఓట్లు రాల్చే బోర్డుగా అది మారింది. కేంద్రంలో అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం కావచ్చు. రాష్ట్రంలో అధికా రంలో కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కావచ్చు, పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామంటూ రైతులను మభ్యపెట్టడమే తప్ప దాన్ని పట్టాలెక్కించింది లేదు. వందరోజుల్లో పసుపుబోర్డును ఏర్పాటు చేస్తానంటూబీజేపీ ఎంపీ అర్వీంద్‌ రైతులకు అఫిడవిట్‌ కూడా రాసిచ్చి ఓట్లు పొందారు. బీజేపీ వాగ్దానాన్ని నమ్మి ఓట్లేసిన రైతులకు ఆయన చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికల్లో చాలా చెబుతాం అన్ని చేస్తామా? పసుపుబోర్డు కంటే ఎక్కువగానే చేస్తున్నాం కదా? అంటూ రైతులను ఎదురు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ల వ్యాపారాన్ని పెంచేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తున్న బీజేపీ సర్కారు…పసుపుబోర్డు ఏర్పాటు చేసి రైతులకు మేలు చేస్తామంటే, నమ్మెదెలా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇబ్బడిముబ్బడిగా దిగుమతులు పెరుగుతున్నాయి. ఫలితంగా పంట ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతున్నదిపెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడం వల్ల పసుపు ఉత్పత్తి వ్యయం అమాంతం పెరుగుతున్నది. ట్రాక్టర్ల కిరాయి, కూలీల కొరత, నిల్వల సామర్థ్యం లేకపోవడం, ప్రాసెస్‌యూనిట్లు తక్కువగా ఉండటం తదితర ఇబ్బందులతో పసుపు రైతు కుదేలు అవుతున్నారు. ఆ పంట వేస్తే ఎకరాకు రూ. 1.20 లక్షల ఖర్చు వస్తున్నది. రాష్ట్రంలో పసుపు పంటకు నిజామాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, మహబూబాబాద్‌ జిల్లాలు ప్రసిద్ధి. నిజామాబాద్‌లో అత్యధికంగా సాగవుతున్నది. దేశంలోనే ఉమ్మడి రాష్ట్రం 60 శాతం నుంచి 70 శాతం పసుపు ఉత్పత్తి అయ్యేది. అయితే గత మూడేండ్లుగా రాష్ట్రంలో వేగంగా ఉత్పత్తి తగ్గుతున్నది.
 
 
దేశంలోకి పసుపు దిగుమతులు పెరగడంతో తెలంగాణలో ధరలు పడిపోతున్నాయి. క్విటాల్‌కు రూ. 12వేలు పలికే పసుపు ధర సగానికి సగం పడిపోయింది. మార్కెట్‌లో డిమాండ్‌, సప్లరు పరిస్థితుల ఆధారంగా పసుపు ధర నిర్ణయిస్తున్నారు. అయినా ఆరోగ్య పరంగా ఎంతో విలువైన పసుపు పంటకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించకపోవడం గమనార్హం. మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికీ మహారాష్ట్రంలో క్వింటా రూ 12వేలు పలుకుతుండగా, రాష్ట్రంలో మాత్రం అందులో సగం ధరే ఉన్నది. మధ్యదళారుల ప్రమేయం పెరిగిపోయింది.వారు రైతుల వద్ద తక్కువ ధరకు సేకరించి మహారాష్ట్రలో అమ్ముకుంటున్నారు. దీనికితోడు పసుపు దిగుమతులు పెరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాగు ఖర్చులను భరించలేక చాలా మంది సాగును తగ్గిస్తున్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Difficulties for the yellow board