అఖిల ప్రియపై కష్టకాలం

Difficulty on all dear love

Difficulty on all dear love

Date:13/03/2018
కర్నూలు ముచ్చట్లు:
ఏపీ మంత్రి అఖిలప్రియను ఏడిపిస్తున్నవారెవరు? ఆమెను ఇబ్బంది పెడుతున్నది తెలుగుదేశం పార్టీ నేతలేనా? ఇప్పుడు అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ, కర్నూలు జిల్లాలోనూ సంచలనమయ్యాయి. భూమా వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో మంత్రి అఖిలప్రియతో పాటుగా మంత్రులు కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ అమ్మా, నాన్న చనిపోయినప్పుడు కూడా తాను ఏడ్వలేదని, అయితే తమను ఏడిపించాలని కొందరు చూస్తున్నారని, అది సాధ్యం కాదని స్పష్టం చేశారు.అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గంలో టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి బయటకు వచ్చినట్లయింది. మంత్రి అఖిలప్రియకు దివంగత భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డికి మధ్య పొసగడం లేదు. ఇటీవల ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో విందు ఏర్పాటు చేసి టీడీపీ నేతలను తన వర్గంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ విందుకు హాజరు కావద్దని అఖిలప్రియ చెప్పినా అనేకమంది నేతలు ఈ విందుకు హాజరయిన సంగతి తెలిసిందే.భూమా మరణం త్వర్వాత నంద్యాల ఉప ఎన్నికలో టిక్కెట్ ను ఏవీ సుబ్బారెడ్డి ఆశించారు. భూమా నాగిరెడ్డి జీవించి ఉన్నంతకాలం ఆయన వెన్నంటే ఉండి నంద్యాల, ఆళ్లగడ్డలో పార్టీ కార్యకర్తలకు ఆయన అండగా ఉండేవారు. పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునే వారు. అయితే భూమా మరణం తర్వాత అఖిలప్రియకు మంత్రివర్గంలో చోటు దక్కింది. అప్పటి నుంచి మంత్రి అఖిలప్రియ తనను, తన వర్గాన్ని పట్టలించుకోవడం లేదన్నది ఏవీ ఆరోపణ. ఈ నేపథ్యంలో అనేకసార్లు పెద్దల వద్ద పంచాయతీలు చాలాసార్లు జరిగాయి.నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ ఏవీ పెద్దగా పట్టించుకోలేదన్న వార్తలొచ్చాయి. అప్పుడు కూడా ఏవీకి ఏదో ఒక పదవిని కట్టబెడతామని అధిష్టానం హామీ ఇచ్చింది. ఆ హామీ ఇంతవరకూ నెరవేరలేదు. సాధారణ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వీరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని చెబుతున్నారు. ఏవీ ఏ సమయంలోనైనా నిర్ణయం తీసుకోవచ్చని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే అఖిలప్రియ మాత్రం ఏవీని వదిలించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఆయన తమకు అండగా నిలచింది లేదని, అలాంటప్పుడు ఆయనతో తాము ఎందుకు రాజీ పడాలని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద భూమా వర్ధంతి సందర్భంగా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయనే చెప్పొచ్చు. అఖిల ఏవీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు.
Tags: Difficulty on all dear love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *