Natyam ad

ఏపీ మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్

తిరుపతి  ముచ్చట్లు:


ఇంత కాలం ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోని వైసీపీ సర్కార్ ఎట్టకేలకు మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులకు ఓకే చెప్పింది. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాకా.. మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వ వ్యాపారంగా మార్చేశారు. ప్రజలలో మద్యం అలవాటు మాన్నించడానికే అంటూ మద్యం ధరలను విపరీతంగా పెంచేశారు. ఇక ప్రభుత్వ మద్యం దుకాణాల సంఖ్యను కూడా క్రమంగా తగ్గించుకుంటూ వస్తానంటూ కొత్త విధానాన్ని ప్రకటించారు.కొత్త కొత్త బ్రాండ్లను తీసుకువచ్చారు. దీంతో ధర ఎక్కువ, నాణ్యత తక్కువ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మద్యం ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే ధరలు పెంచేశారన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. అన్నిటికీ మించి అన్ని చోట్ల చెల్లింపులు డిజిటల్ రూపంలో జరగడానికి లేని అభ్యంతరం ఒక్క మద్యం దుకాణాల్లోనే ఎందుకన్న ప్రశ్నలూ తలెత్తాయి. మద్యం దుకాణాల్లో డిజిటల్, ఆన్ లైన్ పేమెంట్లకు వీల్లేదన్న ఆంక్షలపై విమర్శలే కాదు అనుమానాలూ వ్యక్తమయ్యాయి.

 

 

 

నిత్యం కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగే మద్యం వ్యాపారంలో డిజిటల్ చెల్లింపుకు ఎందుకు అనుమతించడం లేదన్న ప్రశ్నలూ వెల్లువెత్తాయి. ఎందుకంటే    మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వానివే అయినా..సరఫరా.. తయారీ..   మొత్తం వైసీపీ నేతల గుప్పిట్లో ఉంది. మద్యం దుకాణాల్లో నగదు లావాదేవాలకు మాత్రమే అనుమతి అంటూ ప్రభుత్వం చెబుతుండటంతో.. ఆ సొమ్మంతా ఎక్కడకు పోతోందన్న అనుమానాలు పొడసూపాయి. ఈ సొమ్మ బ్లాక్ మనీగా  తరలిపోతోందని విమర్శలూ ఉన్నాయి. ఇక బేగం పేట విమానాశ్రయం నుంచి  ప్రైవేట్ చార్టర్డ్ విమానాల్లో పెద్ద మొత్తంలో సొమ్ము తరలించారని ఢిల్లీ మద్యం స్కాం దర్యాప్తు చేస్తున్న ఈడీ దర్యాప్తులో తేలడంతో ఏపీలో మద్యం సొమ్మును కూడా అలాగే తరలిస్తున్నారంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్, విశాఖ పాత విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించిన చార్టర్ట్ ఫ్లైట్ల గుట్టు కూడా బయట పెట్టాలంటూ తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభి డిమాండ్ చేశారు.

 

 

 

Post Midle

బేగంపేట విమానాశ్రయం నుంచి సొమ్ము తరలింపునకు ఉపయోగించిన చార్టర్డ్ విమానాలు ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్టయిన అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి భార్య అనికా టేక్రీవాల్ రెడ్డికి చెందిన జెట్ సెట్ గో సంస్థకు చెందినవని ఈడీ అనుమానిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ పై విమర్శల దాడి జరిగింది. శరత్ చంద్రారెడ్డి వైసీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు.. వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి అల్లుడి అన్న కావడం.. అంతకంటే ముందే.. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు కావడంతో జగన్ సర్కార్ డిఫెన్స్ లో పడింది. దీంతో గత్యంతరం లేకనే మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ కు కూడా అనుమతి ఇస్తామని ప్రకటించింది. ఏపీలోని మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లను అనుమతిస్తామని ప్రకటించింది. ఇప్పటి దాకా అనుమతించని డిజిటల్ పేమెంట్లకు ఇప్పుడెందుకు అనుమతిస్తున్నారన్న ప్రశ్నకు షాపుల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తేలిందనీ,

 

 

దానిని అరికట్టేందుకేననీ బదులిస్తోంది.ఇంత కాలం ఆ విషయాన్ని గుర్తించలేదా అన్న ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు. పోనీ సిబ్బంది చేతివాటానికి అవకాశం లేకుండా మద్యం దుకాణాల్లో పూర్తిగా డిజిటల్ పేమెంట్పే అంటున్నారా అంటే అదీ లేదు. నగదు చెల్లింపులకూ చాన్స్ ఉంటుందంటున్నారు. అంటే సిబ్బంది చేతి వాటానికి భయపడే డిజిటల్ పేమెంట్స్ కు అనుమతి ఇస్తున్నామన్న మాట పూర్తిగా వాస్తవం కాదన్న మాట. విమర్శలకు తలొగ్గే ఆ నిర్ణయం తీసుకున్నారని అర్ధమౌతోంది. కానీ డిజిటల్ పేమెంట్స్ అని బయటకు చెప్పినా అది నామ్ కే వాస్తే అమలు చేస్తారనీ, సాంకేతిక సమస్య సహా పలు రకాల సాకులతో మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపులకే పట్టుబట్టే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు అంటున్నారు.

 

Tags: Digital Payments at AP Liquor Shops

Post Midle

Leave A Reply

Your email address will not be published.