తెరమీదకు డిజిటల్ రేప్

కోల్ కత్తా ముచ్చట్లు:

జురోజుకు మహిళలపై జరుగుతున్న దారుణాలకు అంతే లేకుండా పోతోంది. చిన్నా, పెద్దా అని తేడా లేదు కామాంధులకు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో మూడేళ్ళ బాలికను డిజిటల్ రేప్ చేసిన 75 ఏళ్ళ వృద్దుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది న్యాయస్థానం. 2019 లో జరిగిన ఈ ఘటనపై తాజాగా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని ఒక గ్రామంలో అక్బర్ అలీ(75) అనే వృద్ధుడు నివసిస్తున్నాడు. వారి ఇంటి పక్కనే మూడేళ్ళ బాలిక కుటుంబం నివసిస్తోంది. పొరుగు ఇల్లే కదా అని బాలిక అప్పుడప్పుడు అలీ వద్దకు వచ్చి ఆడుకొంటూ ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక రోజు ఉదయం 11 గంటల సమయంలో బాలిక అలీ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో బాలికకు చాక్లెట్ ఇస్తానని చెప్పి రూమ్ లోకి తీసుకెళ్లి రేప్ చేశాడుఇక కొద్దిసేపటి తరువాత బాలిక ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో అతనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు బాలికకు టెస్టులు చేయగా.. ఆమె ప్రైవేట్ భాగాల్లో ఎక్కడా గాయాలు కాలేదని తేలింది.

 

 

అంతేకాకుండా అలీ అత్యాచారం చేసినట్లు ఏ ఆధారం కనిపించలేదు. దీంతో అలీ మనవరాలు.. తమపై పగతోనే ఇదంతా చేస్తున్నారని, తన తాత అలాంటిదేమి చేయలేదని చెప్పుకొచ్చింది. ఆ తరువాత బాలికను, తాత ఏం చేశాడని సున్నితంగా అడిగిన తరువాత దాన్ని డిజిటల్ రేప్ గా పరిగణిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. అసలు డిజిటల్ రేప్ అంటే ఏంటి..? అంటే.. ఇంగ్లిష్ లో డిజిట్ అంటే సంఖ్య అని అర్ధం.. అదే కాకుండా వేలు అని కూడా అర్ధం వస్తుంది. అంటే.. ఒక పురుషుడు తన ప్రైవేట్ భాగాన్ని వాడకుండా వేలితో మహిళల ప్రైవేట్ భాగం లోపలికి చొప్పించి వారిని హింసిస్తూ లైంగిక ఆనందం పొందడాన్ని డిజిటల్ రేప్ అంటారు. ఇక నిందితుడు ఈ క్రైమ్ కు పాల్పడినట్లు నిర్దారణ అవ్వడంతో అతనికి రూ. 50,000 జరిమానా విధించి, యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఈ తీర్పు పశ్చిమ బెంగాల్ లో సంచలనంగా మారింది.

 

Tags: Digital rape on screen

Leave A Reply

Your email address will not be published.