సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులకు డిజిటల్‌ శిక్షణ

Digital training for Sarva Shiksha Abhiyan employees

Digital training for Sarva Shiksha Abhiyan employees

Date:09/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులకు డిజిటల్‌ లిటరసీ తరగతుల శిక్షణను మంగళవారం ఎంఈవో లీలారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని సీఆర్‌పిలు, పీటిఐల కు కంప్యూటర్‌ తరగతులను ఈ నెల 16 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ డిజిటల్‌ తరగతులకు హాజరై, కంప్యూటర్లపై అవగాహన పెంచుకోవాలన్నారు. దీని ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు పారదర్శకంగా కొనసాగించేందుకు వీలౌతుందన్నారు. రీసోర్స్పర్శన్లుగా అఖిల, సాయిప్రసన్న శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పిలు శ్రీనివాసులు, నారాయణస్వామి, తేజ్‌కుమార్‌, రమణ, మీనాక్షి, మంజుల. శిల్ప, అంజమ్మ, లతిఫ్‌తో పాటు పార్ట్టైం ఉద్యోగులు మహబూబ్‌బాషా, చెన్నరాయప్ప, సాధిక్‌, విజయ్‌, సుల్తానారజియా, అపర్ణ, లక్ష్మి, ముదశిర తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి సాయి ఆలయాలలో శతజయంతి వేడుకలు

Tags; Digital training for Sarva Shiksha Abhiyan employees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *