గూడూరు హైవేలో డిజిటన్ స్పీడో మీటర్
నెల్లూరు ముచ్చట్లు:
అత్యంత వేగంగా వెళ్లే వాహనాలు వలన రోడ్డు ప్రమాదాలు ఎక్కవ గా జరుగుతున్నాయి. ఈ ప్రమాదం ఏ స్థాయి లో ఉంటుందో తెలుపుటకు గూడూరు హైవే మీద జరిగినా ప్రమాదాన్ని సిసి కెమెరా లో రికార్డుయన వీడియోను పోలీసులు విడుదల చేసారు. అత్యంత వేగంగా వాహనాలు నడుపుతూ ప్రాణాలు మీదకి తెచ్చుకుంటున్నారు. పోలీస్ అధికారులు కొన్నిచోట్ల. ఎంత స్పీడ్ పోవాలో నిర్ణయించి అక్కడ బోర్డు పెట్టినప్పటికీ ఆ బోర్డు చూస్తూ కూడా అంత కన్నా వేగంగా వాహనాలు నడుపుతూ వెళుతుంటారు. అత్యంత వేగమే ఎన్నో జీవితాలన్నీ బలిగొంది . ఆ వేగమే ఎన్నో కుటుంభాలను నిరాశ్రయులను చేసింది.
ఈ క్రమంలో ఆ ప్రమాదాలు అరికట్టేందుకు గూడూరు పోలీసు అధికారులు ప్రతిష్టాత్మకంగా డిజిటల్ స్పీడో మీటర్ గన్ అనే యంత్రాన్ని ప్రవేశపెట్టారు . గూడూరు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి, రూరల్ సిఐ దశరధ రామారావు ,రూరల్ ఎస్సై బ్రహ్మనాయుడు, స్పిడో మిటర్ గన్ గూడూరు హైవే లో లాంఛనంగా ప్రాంభించారు. స్పీడ్ గన్ పనితీరును డిఎస్పి పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ లో భాగంగా ప్రజల శ్రేయస్సు కోరి డిజిటల్ స్పిడో మిటర్ గన్ ను హైవే వద్ద అమర్చడం జరుగుతుందని అన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రకారం నిర్ణయించిన స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ లో వాహనాలు వెళుతుంటే ఆటోమేటిక్గా ఈ యంత్రం ఫోటో తీసి వాహనా యజమానికి పైన్ బిల్లు పాస్ చేస్తుందని తెలిపారు. కావున వాహనాదారులు, ట్రాఫిక్ నియమానిబంధనలు తప్పకుండా పట్టించాలని పోలీసులు అధికారులు హెచ్చరించారు.

Tags; Digiton Speedo Meter on Gudur Highway
