మళ్లీ ఆసుపత్రిలో దిలీప్ కుమార్

ముంబై ముచ్చట్లు:

 

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ దిలీప్ కుమార్ మరోసారి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో.. వెంటనే బుధవారం ఉదయం ముంబైలోని హిందుజా హస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఇటీవలే అనగా జూన్ 6వ తేదీన దిలీప్‌‌కి శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స చేయించారు. అయితే ఆయన ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో రెండు వారల క్రితం డిశ్ఛార్జి చేసి ఇంటికి పంపించారు. దాదాపు 15 రోజుల తర్వాత మళ్లీ అదే సమస్యతో ఇప్పుడు ఆయన హాస్పిటల్‌లో చేరడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఐసీయూలో చికిత్స పొందుతున్న దిలీప్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని సమాచారం. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంచి ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది హాస్పిటల్ సిబ్బంది. ప్రస్తుతం దిలీప్ కుమార్ వయస్సు 98 సంవత్సరాలు. 1944లో తెరకెక్కిన ‘జ్వార్‌భాత’ సినిమాతో వెండితెరపై కాలుమోపిన ఆయన ఎన్నో సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు గడించారు. 1998లో విడుదలైన ‘ఖిల్లా’ మూవీ తర్వాత ఆయన తన సినీ కెరీర్‌కి గుడ్ బై చెప్పారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Dilip Kumar in hospital again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *