కొలకలూరులో ప్రబలిన డయోరియా
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో డయేరియా ప్రబలినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని గరువు కాలనీలో 14 ఏళ్ల బాలిక వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానిక ఆర్ఎంపీ బాలికకు అందించారు. అయితే చికిత్స పొందుతూ అర్ధరాత్రి బాలిక మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. బాలిక మృతి చెందడంతో తల్లిదండ్రుల తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అదే విధంగా గ్రామంలో మరికొంతమంది వాంతులు విరోచనాలతో బాధపడుతూ పీహెచ్సీలో జాయిన్ అయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో తెనాలి తరలించినట్లు తెలుస్తోంది. దీంతో పంచాయతీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. డయేరియా ప్రబలిన గరువు కాలనీలో తాగునీటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు తరలించారు. గరువు కాలనీలో డయేరియా ప్రబలినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తెనాలి ఆసుపత్రిలో డయారియా లక్షణాలతో ముగ్గురు చేరారు. బాధితులను సబ్ కలెక్టర్ నిధి మీనా పరామర్శించారు. డయేరియాతో 25 మంది ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.
Tags: Dioria prevalent in Kolkata

