ముంచేస్తున్న గండి

మహాబూబ్ నగర్ ముచ్చట్లు:
 
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టు నిప్పు కోసం మరొకడు ఎదురు చూసినట్టు’ ఉంది ఎస్ఆర్ఎస్పీ అధికారుల తీరు. నాలుగ రోజుల క్రితం సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం మానాపురం గ్రామం వద్ద (బాపనిబావి తండా, రావులపల్లి క్రాస్ రోడ్డు తండాల మీదుగా మహబూబాబాద్ జిల్లా వైపు సాగే) కాలువకు గండి పడిన విషయం తెలిసిందే. ఆ నీరంతా పెద్ద ఎత్తున వృథాగాపోతే పంట పొలాలను పూర్తిగా ముంచేసింది. దీంతో కొంతమంది రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయారు. ఈ విషయం తెలిసినా ఎస్ఆర్ఎస్పీ రెండవ దశ శాఖ అధికారుల్లో చలనం లేకుండా పోతోంది. ఫలితంగా వృథాగా వెళ్లిపోయే నీటితో మరోచోట గండి పడి అక్కడ కూడా రైతాంగాన్ని ముంచేసింది.వెంటనే నీటిని నిలిపి వేసి గండిని పూడ్చాలని రైతులు కోరుతున్నా .. అధికారులు మాత్రం రేపు,మాపు అంటూ కాలయాపనలో చేయడంతో పంటపొలాలు మునిగిపోయాయి. రైతులు లకావత్ శేఖర్, లకావత్ గోపిసింగ్, లకావత్ దేవానంద్, మంజుల, బానోత్ బాల్య తదితర 40 మంది రైతులకు చెందిన పంటపొలాలు మునిగిపోగా, మరికొన్ని కొట్టుకుపోయాయి. వృథాగా వెళ్లే నీరంతా పంట పొలాలు చెరువు మీదుగా రావులపల్లి గ్రామం వైపు చేరి అక్కడ ఉన్న మరో చిన్నపాటి కట్టను తెంపి పంట పొలాలను ముంచేసింది ఇప్పటికే రైతులు వేలాది రూపాయల ఖర్చు చేసి నాట్లు వేసి, యూరియ చల్లడం చేసిన రెండు రోజుల్లోనే ఈ పరిణామాలు జరగడం కోలుకోలేని దెబ్బగా మారింది. దీంతో రైతులు తమకు జరిగిన నష్టాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం ఆ శాఖకు చెందిన ఒకరిద్దరు అధికారులు సంఘటనా స్థలానికి చేరి పరిశీలించారు. గండిని రేపటిలోగా పూడుస్తామంటూ చెప్పి వెళ్లిపోయినట్లు అక్కడి రైతులు వివరించారు.
 
Tags; Dipping mill

Leave A Reply

Your email address will not be published.