‘దిశ’ నిందితుల ఎంకౌంటర్ హర్షణీయం

'Direction' accused's encounter is harsh

'Direction' accused's encounter is harsh

Date:06/12/2019

పెద్దపంజాణి ముచ్చట్లు:

దిశ హత్యాచారం కేసులో నిందితులను సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేయడం పై దేశ, రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా వాడ వాడాలా హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పోలీసులు శబాష్ అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి. ఈ సందర్బంగా పెద్దపంజాణి పోలీసు స్టేషన్ లో ఎస్సై లోకేష్ రెడ్డి సమక్షంలో గుండ్లపల్లె గ్రామానికి చెందిన సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేకును కట్ చేసిఅందరికి పంచి పెట్టారు. పోలీసుల ధైర్య సాహసాలను అభినందించారు. యువత పెడదోవ పట్టకుండా సక్రమ మార్గంలో నడుచుకోవాలని ఎస్సై సూచించారు. దిశకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. దిశ పై దాడి చేసి అత్యాచారం, హత్య నలుగురు నిందితుల కేసు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం హర్షణీయం. దిశ నిందితులకు సరైన శిక్ష విధించిన రియల్ పోలీసులు. ఇకముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకొని రూపుమాపాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, మండల నాయకులు మురహరి రెడ్డి, రవి, గ్రామస్థులు బాబు, బాలరాజు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

 

మారెమ్మకు ప్రత్యేక అలంకరణ

 

Tags:’Direction’ accused’s encounter is harsh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *