నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుపై దిశానిర్దేశం

Direction of the new gram panchayat

Direction of the new gram panchayat

Date:12/07/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి ఉనికిలోకి రానున్న నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుపై పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలు, జడ్పీ సీఈవోలతో మంత్రి జూపల్లి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతన పంచాయతీలకు భవనాల ఏర్పాటు,ఉద్యోగుల విభజన, ఆస్తుల విభజన తదితర అంశాలను నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామ కార్యదర్శులను జనాభా ప్రతిపాదికన రేషనలైజేషన్ చేయాలని చెప్పారు. హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి.. ప్రతి గ్రామంలోనూ నర్సరీల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జూపల్లి కృష్ణారావు.తెలంగాణ వ్యాప్తంగా మొత్తం గ్రామ పంచాయితీల సంఖ్య12,741, ఇందులో కొత్త గ్రామ పంచాయతీలు 4,380కాగా 1326 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఎస్టీలు ఉన్నారు. షెడ్యూల్డ్ గ్రామ పంచాయితీలు 1,311 ఉన్నాయి. 12,741గ్రామ పంచాయితీల్లో 1,13,270ల వార్డులు ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 721గ్రామ పంచాయితీలు ఉండగా అత్యల్పంగా మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లాలో 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.
నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుపై దిశానిర్దేశం https://www.telugumuchatlu.com/direction-of-the-new-gram-panchayat/
Tags:Direction of the new gram panchayat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *