నిందితుడిపై దిశ 2019 చట్టాన్ని తక్షణమే ఆమలు చేయాలి

బాలికకు అండగా ఆయా పార్టీల నేతలు ఆస్పత్రి ఎదుట ధర్నా

Date:14/12/2019

గుంటూరు ముచ్చట్లు:

ఐదేళ్ల వయసున్న అభంశుభం తెలియని పాపపై జరిగిన అత్యాచారాన్ని టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం నేతలు ఖండించారు. జీజీహెచ్‌‌లో చికిత్స పొందుతున్న బాలికకు అండగా ఆయా పార్టీల నేతలు ఆస్పత్రి కాన్పుల వార్డు ఎదుట ధర్నాకు దిగారు. హోం మంత్రి తక్షణమే రావాలని, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దిశా చట్టంలో గుంటూరు ఘటన తొలి చర్యగా చేపట్టాలన్నారు. జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మైనర్ బాలికపై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భాధితురాలి కుటుంబానికి జనసేన అండగా ఉంటుందన్నారు. నింధితుడిపై దిశ 2019 చట్టాన్ని తక్షణమే ఆమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నిందితుల కేసులను రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు వాదనలు వినిపించకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.ఐదేళ్ల బాలికపై తాడిపత్రి లక్ష్మారెడ్డి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటువంటి ఉన్మాదులను కఠినంగా శిక్షించేందుకు తెచ్చిన దిశ బిల్లును అసెంబ్లీ ముక్తకంఠంతో ఆమోదించిన రోజే గుంటూరు సిటీలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఉదంతంపై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. బాధితురాలు చికిత్స పొందుతున్న జీజీహెచ్‌ ఆస్పత్రి వద్దకు పెద్దఎత్తున చేరుకొని.. నిరసన తెలిపాయి. ‘‘నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేస్తారా.. లేక రెడ్డి సామాజికవర్గం వాడని చెప్పి వదిలిపెడతారా’’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీశాయి. వారితో టీడీపీ, బీజేపీ మహిళా నేతలు కూడా గొంతు కలిపారు. దీంతో జీజీహెచ్‌ ప్రాంతంలో కొద్దిగంటలపాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

మోదీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది

 

Tags:Direction on the accused should be immediately enforced by the 2019 law

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *