దిశ దోషులను కఠినంగా శిక్షించాలి

Directors should be punished harshly

Directors should be punished harshly

Date:03/12/2019

రామసముద్రం ముచ్చట్లు:

దిశ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రామసముద్రం లో మహిళా సంఘాలు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బ్రాహ్మణ మహిళా సంఘం మరియు వాసవి ఆర్య వైశ్య మహిళా సంఘం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బ్లూమింగ్ రోజెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆంజనేయ స్వామి కాలనీ నుండి ప్రారంభమైన ర్యాలీ బజార్ వీధి, మెయిన్ రోడ్, చెక్ పోస్ట్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ మహిళలకు తగిన రక్షణ కల్పించేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు మహిళలపై జరిగే అఘాయిత్యాల కు సంబంధించి త్వరితగతిన విచారణ చేపట్టి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శశికళ, మండల బ్రాహ్మణ సంఘ మహిళా అధ్యక్షురాలు సరస్వతమ్మ, ఆర్యవైశ్య మహిళా సంఘ అధ్యక్షురాలు సుబ్బలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

పేరెంట్స్ కమిటీలు ప్రముఖ పాత్ర వహించాలి

 

Tags:Directors should be punished harshly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *