పుంగనూరులో వైకల్యాలు గుర్తించడంలో నిర్లక్ష్యం చేయరాదు – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

సమాజంలో వివిధ లోపాలతో అవస్థలు పడుతున్న పిల్లల లోపాలను గుర్తించడంలో నిర్లక్ష్యం చేయకుండ వారికి తగిన సహాయ సహకారాలు అందించాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. గురువారం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధికారి భారతి, మెడికల్‌ ఆఫీసర్‌ సల్మా , ఏఎంసీ చైర్మన్‌ నాగరాజరెడ్డి తో కలసి ఆశ, ఏఎన్‌ఎం, ఐసిడిఎస్‌, వెల్పేర్‌ అసిస్టెంట్లు, సంఘమిత్రలు, సీఆర్‌పీ లకు భవిత కేంద్రంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. భాస్క్రర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి వైకల్యం లక్షణాలు కలిగిన 18 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి, వారికి ప్రభుత్వం ద్వారా సదరమ్‌ సర్టిపికెట్లు ఇప్పించాలన్నారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాలు అందించి, వారి కుటుంభాలను ఆదుకున్న వారు అవుతామని తెలిపారు. ఈ సర్వే 30వ తేదీలోపు నిర్వహించాలని, వైకల్యం కలిగిన వారికి సేవ చేయడం ఎంతో అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, భవిత సిబ్బంది వెంక ట్రమణ, బిందు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Disabilities in Punganur should not be neglected – MP Akkisani Bhaskar Reddy

Leave A Reply

Your email address will not be published.