అంగళ్లులో ఓంటె అదృశ్యం. ఆచూకీ చెబితే పారితోషికం.

అమరావతి ముచ్చట్లు:

ఓంటెను ఎడాది ఓడ అంటారు.. అంత పెద్దగా ఉంటుంది.ఇలాంటి ఓంటెను కూడా దొంగలించిన అరుదైన విచిత్రకర సంఘటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. త్వరలోజరగబోయే బక్రీద్ కు అంగళ్లుకు చెందిన కొందరు 12 రోజుల క్రితం రూ.1.25 లక్షలతో ఓంటెను కొన్నారు.పరిసర ప్రాంతాల్లో మేపుతూ రాత్రి వేళ ఇంటి వద్ద కట్టేసేవారు. ఆదివారం వేకువ జామున లేచి చూస్తే ఓంటె కన్పించలేదు. తాడు తెంపుకుని బయటకు వెళ్లిందోమోనని తొలుత బావించాడు. స్థానికంగా వెతికినా కన్పించలేదు.ఆరోజు ఉదయం నుండి సాయంత్రం వరకే కాకుండా రాత్రి పొద్దుపోయే వరకు కూడా బృందంగా అంతటా గాలించారు.పరిసర ప్రాంతాలు జల్లెడ పట్టినంత పనిచేశారు.సమీపంలోని గుట్ట పరివాహక ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు చూశారు. ఎక్కడా ఆచూకీ కన్పించలేదు. గుర్తు తెలియని వారు ఎవరైనా తోలుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఓంటె జాడ మాత్రం కన్పించలేదు. అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లె నుండి మదనపల్లెకు కొత్తగా వేస్తున్న బైపాస్ రోడ్డు మీదుగా దీనిని తోలి కెళ్ళి నాన్న వాళ్ళు అడుగులు కనిపించాయి. కొంత దూరం తర్వాత వాహనంలో దీనిని తరలించుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా ఏనుగులు, ఒంటెలు లాంటి వాటిని చోరీ చేయడం ఆషామాషీ కాదు. కష్టంతో పాటు సాహసంతో కూడుకున్న పని. అలాంటిది అంగళ్లులో ఆదివారం ఏకంగా ఓంటేనే చోరీ చేశారంటే వారెంత ఘనులో అర్థం చేసుకోవచ్చు. ఓంటె ఆచూకీ తెలిస్తే 8978126623 మొబైల్ నెంబర్ కు సమాచారం ఇస్తే తగిన పారితోషికం ఇస్తామని తెలిపారు.

 

Tags:Disappearance of the camel in the jaws. Reward if found.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *