నిరాశ కలిగించిన ప్రధాని పర్యటన
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ ఉక్కు కోసం, రైల్వే జోన్, ప్రత్యేక హోదా కోసం, ప్రధాని మోడీ ప్రకటన చేస్తారని అందరూ ఆశగా ఎదురు చూశారని,కానీ వాటిని ప్రస్తావించకపోవడంపై టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అసహనం వ్యక్తం చేశారు.మోడీ విశాఖ పర్యటన వల్ల 100 కోట్లు ఖర్చు తప్ప, ఉత్తరాంధ్ర ప్రజలకు ఏమి లాభం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల నుండి తప్పించుకోవడానికి ప్రధాని మోడీ ముందు బల ప్రదర్శన చేశారని విమర్శించారు. రాష్ట్ర పరిస్థితులను ప్రధాని మోడీకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వివరించినందుకు ఆయనను అభినందించారు.
టిడిపి విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధాని మోడీని విశాఖ తీసుకొచ్చి ఏం చేశారో బిజెపి నాయకులు సమాధానం చెప్పాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని శాంతియుతంగా నిరసన తెలియ చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదయినా మోడీ మాట్లాతారని అందరూ ఆశించారని తెలిపారు. మోడీ విశాఖ వచ్చి కొత్తగా ఏమి ప్రారంభించలేదని, టిడిపి హయాంలో మొదలు పెట్టినవే ఆయన ప్రారంభించారని పేర్కొన్నారు. వైసీపీ నేతలు మోడీ మెప్పు పొందెందుకు, కేసులు నుండి తప్పించుకోవడానికి జనాలను భారీగా తరలించారని విమర్శించారు.

Tags: Disappointing Prime Minister’s visit
