అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం : బట్టి విక్రమార్క

 Date:11/08/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
దశాబ్దాల కోరికయిన తెలంగాణ రాష్ట్రం ను సాకారం చేసిన రాహుల్ 13, 14న తెలంగాణకు వస్తున్నారు.ఓయూ విద్యార్థులు పదే పదే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని కలిసి రాహుల్ ను ఆహ్వానిస్తున్నాం అని అడిగితే మేం రాహుల్ కు విజ్ఞప్తి చేశాం. రాహుల్ టూర్ కోసం ఓయూ పర్మిషన్ కూడా కోరాం.దానికి ప్రభుత్వం పర్మిషన్ నిరాకరించడం శోచనీయమని టపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ఆత్మాభిమానం, ఆత్మ గౌరవంతో బతికేవాళ్ళను తిరస్కరించారని మేం భావిస్తున్నాం. రాష్ట్రం ఇచ్చింది నాలుగు కోట్ల ప్రజానీకానికి కానీ…నలుగురి కోసం మాత్రం కాదు. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని అన్నారు. ఈరోజు పర్మిషన్ ఆపగలిగారేమో కానీ..భవిష్యత్ లో ఆపలేరు. భవిష్యత్ లో కంచెలు అడ్డు పెట్టినాఓయూ కు వెళతాం. విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటామని అయన అన్నారు. మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ బీ-టీమే టీ.ఆర్.ఎస్ పార్టీ. ఈ సర్కార్ లో ప్రశ్నించే హక్కును కల్పించకపోవడం దారుణం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది.చైతన్య, నారాయణ కాలేజీల్లో టీ.ఆర్.ఎస్ వాళ్ళు వాటాలు తీసుకుంటున్నారు. ఎస్సారెస్పి నీళ్ళడిగితే…ఈ సర్కార్ లో నిర్బంధం చేస్తున్నారని అయన అన్నారు. మాజీ మంత్రి గీతా రెడ్డి మాట్లాడుతూ ఎస్.హెచ్.ఇ గ్రూప్స్ భారీ ఎత్తున రాహుల్ సభకు హజరుకావాలి. టి.ఆర్.ఎస్ ఎన్నికలకు వెళ్తామంటున్నారు. ఈ సర్కార్ లో ఒక్క మహిళా మంత్రి అయినా ఉన్నారాఅని ఆమె ప్రశ్నించారు. యాదాద్రి గుట్ట కింద జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ సర్కార్ కు కన్పించడం లేదా…? ఇన్ని సంఘటనలు జరుగుతున్నా…ఈ సర్కార్ కళ్ళకు గుంతలు కట్టుకుందా…?  సర్కార్ రెండు వేల కోట్ల బకాయిలు మహిళా సంఘాలకు వడ్డీ బాకీ ఉందని అన్నారు. బైసన్ పోలో గ్రౌండ్ ను కేంద్రం సెక్రెటరేట్ కు ఇస్తే కాంగ్రెస్ మరో పోరాటానికి సిద్ధమవుతది. ముందస్తు ఎన్నికల కోసం కెసిఆర్ ప్రధానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారని ఆమె అన్నారు.
Tags:Disappointment: Disappointment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *