క్రికెట్ అభిమానులకు నిరాశ

విశాఖపట్నం ముచ్చట్లు:


ఎంతో ఆశతో ఎదురు చూసిన  భారత్, దక్షిణాఫ్రికా టి20 టిక్కెట్ల విక్రయాలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌంటర్ ప్రారంభిం చిన కొద్ది సేపటికే 600 రూ టిక్కెట్లు అయిపోయాని చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు.స్వర్ణ భారతీ స్టేడియం లో క్యూలైన్లలో 600 రూపాయల టిక్కె ట్ల కోసం అభిమానులు పడిగాపులు కాసారు.టిక్కెట్లను దారి మళ్లించి తమకు కావాల్సిన వారికి  ఇచ్చుకున్నారనీ ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి పడిగాపులు కాసిన వారిని కాదని వేరెవరికో ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు స్వర్ణభారతీ ఇండోర్ స్టేడియం కౌంటర్ లో టిక్కెట్ల ప్రింటింగ్ లో సమస్యలు తలెత్తాయి. సర్వర్ మొరాయిం చడంతో టిక్కెట్ విక్రయాలు నిలిచిపోయాయి. దీంతో  క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

 

Tags: Disappointment for cricket fans

Post Midle
Post Midle
Natyam ad