మహబూబాబాద్ లో సద్దుమణిగిన తెరాస అసమ్మతి

Date:13/10/2018
వరంగల్ ముచ్చట్లు:
వరంగల్ జిల్లాలో అధికార పార్టీ అభ్యర్దులకు ఎదురవయిన అసమ్మతి లొల్లి సద్దుమణిగింది. అపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేసిన ప్రయాత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. అయన ఏర్పాటు చేసిన సమావేశంలో మహబూబాబాద్, డోర్నకల్  నియోజకవర్గ  అసమ్మతివాదులు అధికార అభ్యర్దికి మద్దుతు పలికారు.  అభ్యర్దులు కుడా మెట్టు దిగి తప్పులుంటే తమను క్షమించమని అడిగారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో కొన్ని చోట్ల ఆశావహులు తమకు అవకాశం రాలేదన్న బాధతో అభ్యర్థికి వ్యతిరేకంగా నిరసన, ఆందోళనలు చేపట్టారు.
అయితే ఇలాంటి ఆశావహులతో పార్టీ చర్చలు చేసి వచ్చే టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవకాశాలుంటాయని హామీ ఇస్తూ వారిని పార్టీ గెలుపు కోసం పనిచేసేలా ప్రయత్నిస్తోందని అన్నారు.  మహబూబాబాద్ నియోజక వర్గంలో కూడా కేసిఆర్ ఆదేశం మేరకు ఇక్కడ కొంత సర్దుబాటు చేయాలని వచ్చాము. అయితే అభ్యర్థితోనూ, ఆశావహులతోనూ చేసిన చర్చల్లో ఆశావహులు బేషరతుగా అభ్యర్థి శంకర్ నాయక్ గెలుపు కోసం పనిచేస్తామని చెప్పడం చాలా సంతోషకరంరమని అన్నారు.
అభ్యర్థి శంకర్ నాయక్  మాట్లాడుతూ  ఎవరినైనా బాధ పెట్టి ఉంటే, నోరు జారీ మాట అని ఉంటే నన్ను క్షమించండి. మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో క్షమించండి. ఇక నుంచి అందరిని కాపాడుకుంటూ, గౌరవించుకుంటాను. నావంతు సాయం చేస్తాను. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు.
డోర్నకల్ నియోజకవర్గ అభ్యర్థి డీఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ తన డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని అందరు నాయకులు తనకు సపోర్ట్ చేస్తామని హామీ ఇవ్వడం సంతోషమని అన్నారు.
Tags: Disappointment in Mahabubabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *