హోదా ఇవ్వకపోవడం దారుణం విభజన అంశాలు అసంపూర్తి

Disappointment is not incomplete

Disappointment is not incomplete

ఆర్ధిక సంఘంతో సీఎం చంద్రబాబు
Date:11/10/2018
అమరావతి  ముచ్చట్లు:
పంజాబ్, హర్యానా, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతాలు తక్కువ. విశాఖపట్నం, అమరావతి మినహా ఏపీలో చెప్పుకోతగ్గ అర్బన్ ఏరియా లేదు. అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి ఇంకా 20 ఏళ్లు పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. గురువారం నాడు అయన 15వ ఆర్ధికసంఘంతో భేటి అయ్యారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం. నాలుగేళ్లు నిండిన పసికందు. విభజన సమయంలోనే 14వ ఆర్ధిక సంఘానికి ఇదే విధంగా వినతులు ఇచ్చాం. ఇప్పుడు ఈ 15వ ఆర్ధిక సంఘంలో సభ్యులు చాలామంది నాకు తెలిసినవారే. మీకు తెలుసు నేను 9 ఏళ్లు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాను.ప్రతిపక్ష నాయకుడిగా మీకు తెలుసు నేను ఆర్ధిక సంస్కరణలకు గట్టి మద్దతుదారుడిని అన్నారు.
ఏపిలో రెండవ దశ సంస్కరణలు అమలు చేసింది నేనే. సాంకేతికతకు నేను గట్టి మద్దతుదారుడిని,ఇప్పుడే కాదు,20ఏళ్ల క్రితం కూడా. పోటీ రంగంలో ఎవరైనా సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే. హైదరాబాద్ లో నేను వేసిన పునాదులే ఈ రోజు విజ్ఞాన సమాజంగా మారింది. ఒక ప్యాషన్ గా నేను హైదరాబాద్ అభివృద్ది చేశాను. అప్పుడు కాలినడకన, న్యూయార్క్ లో ఫైళ్లు పట్టుకుని తిరిగి మైక్రోసాఫ్ట్ ను నేను హైదరాబాద్ తెచ్చాను.ఇప్పుడు అలాగే కాలినడకన న్యూయార్క్ లో వర్షంలో తడుస్తూ ఐటి కంపెనీలను ఏపికి తెచ్చేందుకు కృషి చేస్తున్నానని అన్నారు.
రాజకీయం ఏవిధంగా ఒక సామాన్యుడిని దెబ్బతీస్తుందో ఉదాహరణే ఆంధ్రప్రదేశ్. 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం వల్ల 2% ఓట్లకు పడిపోయింది.ప్రజల్లో నెలకొన్న భావోద్వేగాలే దానికి కారణం.పంజాబ్,అస్సాం తదితర రాష్ట్రాలలో భావోద్వేగాల తీవ్రత తెలిసిందే నని అన్నారు. ప్రజల భావోద్వేగాలను అభివృద్ది వైపు మళ్లించాను.నవనిర్మాణ దీక్ష,మహా సంకల్పం తీసుకున్నాను.పట్టుదలగా కసితో రాష్ట్రాభివృద్దికి నడుం కట్టాం. ప్రజల్లో ప్రత్యేక హోదా అంశం ఒక భావోద్వేగ అంశంగా మారింది.విభజన సమయంలో ఇస్తామన్న వాగ్దానం అది. హోదా ఇవ్వకపోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనిఅన్నారు.
కొన్ని సందర్భాలలో రాజకీయ నిర్ణయాలే రాష్ట్రాల తలరాతలను నిర్ణయిస్తున్నాయి. కేంద్రం నుంచిగాని, ఆర్ధిక సంఘం నుంచి గాని మేము కోరేది హ్యాండ్ హోల్డింగ్. భౌతిక సామర్ధ్యంతో బలం చేకూరదు.వాస్తవ బలం అనేది మానసిక సామర్ధ్యంతో సమకూరుతుంది అనే మహాత్మాగాంధీ సూక్తిని గుర్తుచేస్తున్నానని అన్నారు. తుపాన్లు,కరవు వరుస వెంబడి ప్రతిఏటా సతమతం చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 52% జనాభా ఉన్న రాష్ట్రానికి 46% ఆదాయం ఉండేలా విభజించారు.
నాలుగేళ్లుగా విశేషంగా శ్రమించినా ఈ వ్యత్యాసాన్ని అధిగమించలేక పోతున్నాం. ప్రత్యేక హోదా అనేది పార్లమెంట్ లో ఏపికి ప్రధాని ఇచ్చిన వాగ్దానం. నాలుగేళ్లయినా హోదా హామీ నెరవేర్చలేదని అన్నారు. తొలి ఏడాది ఆర్ధికలోటు భర్తీ,రాజధాని నిర్మాణానికి సాయం, దుగరాజ పట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరి, విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు, రాజధానికి  రోడ్, రైల్ కనెక్టివిటి తదితర చట్టంలోని 18 అంశాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Tags:Disappointment is not incomplete

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *