Natyam ad

మహిళా సంఘాలకు రూ:10.50 కోట్ల రుణాలు పంపిణీ

-గజ మాలతో ఎంపీలు, ఎమ్మెల్యేకు సత్కారం
-ఇద్దరు మాజీ సీఎంలుపాలనలో అభివృధ్ది ఎక్కడ?
-పెద్దిరెడ్డిను విమర్శిస్తే ఊరుకోం అమర్‌,నానిలకు హెచ్చరిక
– పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు
 
చౌడేపల్లె ముచ్చట్లు:
 
అక్క, చెల్లెమ్మల సంక్షేమం, ప్రతి కుటుంభానికి ఆర్థికాభివృద్దికి తోడ్పాటు అందించడంకోసం ప్రభుత్వం సున్నావడ్డీతో మహిళా సంఘాలకు మంజూరుచేసిన రుణాలను సద్వినియోగం చేసుకోవాలని లోక్‌ సభ ప్యానల్‌ స్పీకర్‌ , ఎంపీ పివి. మిథున్‌రెడ్డి అన్నారు.బుధవారం చౌడేపల్లె ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో భవన ప్రారంభోత్సవం లో భాగంగా జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు. అనంతరం వెహోక్కలు నాటి పచ్చదనంను పెంపొందించి పర్యావరణాన్ని రక్షించాలని సూచించారు.అలాగే రూ:10.50 కోట్ల రుణాల చెక్‌ను మహిళా సమాఖ్య సభ్యులకు అందజేశారు.ఈ సంధర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్య్సీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనే పథకాలను పార్టీలకు అతీతంగా లబ్దిచేకూర్చి దేశంలో ఆదర్శ సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, పాలనావిధానంను గుర్తించిన పొరుగు ర్ఖా•లు అక్కడ కూడా ఇదే తరహాలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం గర్వకారణమన్నారు. ఇళ్ళ వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజాధారణ పొందిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికు అండగా నిలవాలని కోరారు.
 
జిల్లాలో ఇద్దరు మాజీసీఎంల పాలనలో అభివృద్ది శూన్యం…….
జిల్లానుంచి చంద్రబాబునాయుడు 14 యేళ్ళపాటు , కిరణ్‌కుమార్‌రెడ్డి లిద్దిరు ముఖ్యమంత్రులుగా పాలించినా జిల్లాలో ఏమి అభివృద్దిచేశారంటూ జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు ప్రశ్నించారు. బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ వారిద్దరు తోపాటు మాజీ మంత్రి అమర్‌నాథరెడ్డి ఆయా నియోజకర్గాల్లో ఏమి చేశారని, కనీసం మౌళిక వసతులు కూడా లేక ప్రజలు అవస్థలు పడ్డారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రజలకు రోడ్లు, తాగునీరు, మురుగునీటి కాలువలుఏర్పాటు, అర్హత ఉన్న ప్రతి కుంటుంభానికి పక్కా గృహాలు, పెన్షన్లు, మౌళిక వసతులు కల్పించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిప్రభుత్వానికి దక్కిందన్నారు. టిడిపి పాలనలో కుప్పం, లో ఏమి చేశావయ్య చంద్రబాబు, మీ ప్రాంతాలనే పట్టించుకోని మాజీ మంత్రి అమర్‌నాథరెడ్డి, పులివర్తి నాని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిను విమర్శించే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు. పుంగనూరుతోపాటు, జిల్లాలో జరిగిన అభివృద్ది చూసి మాట్లాడాలని, నోటిని హద్దులో పెట్టుకోకుంటే తగిన రీతిలో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
ఎంపీలు, ఎమ్మెల్యేకు గజమాలతో సత్కారం…..
ఎంపీలు పివి. మిథున్‌రెడ్డి,ఎన్‌. రెడ్డెప్పల, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ను మాజీ ఎంపీపీ రెడ్డిప్రకాష్‌, సర్పంచ్‌ వరుణ్‌ భరత్‌ కలిసి 25 అడుగల భారీ గజమాలతో సత్కరించారు. జెసీబీ సహాయంతో పూలను వేసి స్వాగతించారు.
 
భవన నిర్మాణం ఆదర్శం……
రూ:3 కోట్ల వ్యయంతో ప్రభుత్వం కేటాయించిన సమయం కంటే ముందుగానే నాణ్యతప్రమాణాలను పాటించి ఆదర్శంగా నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ , జెడ్పిటీసీ దామోదరరాజును ఎంపీలు అభినందించారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా మాడల్‌ భవనంగా నిర్మించడం, శుభపరిణామమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిసీఈఓ ప్రభాకర్‌రెడ్డి, జెసీ రాజాబాబు,డ్వామా పీడీ చంద్ర శేఖర్‌, ఎంపీడీఓ సుధాకర్‌, తహసీల్దార్‌ మాధవరాజు, ఎంపీపీ రామమూర్తి, చౌడేపల్లె, సదుం జెడ్పిటిసీలు దామోదరరాజు,సోముశేఖర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీలు సుధాకర్‌రెడ్డి, నరసింహులు యాదవ్‌, కో ఆప్షన్‌ మెంబరు సాధిక్‌ భాషా,పీహెచ్‌సీ కమిటి చైర్మన్‌ కళ్యాణ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Disbursement of loans of Rs. 10.50 crore to women’s associations