సచివాలయ ఉద్యోగులకు క్రమశిక్షణ ముఖ్యం

Discipline is important for ministry employees

Discipline is important for ministry employees

– సీఐ గంగిరెడ్డి

Date:17/10/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ పాలనలో పని చేసే ఉద్యోగులు క్రమశిక్షణతో అనుకున్న లక్ష్యాలను అధికమించాలని సీఐ గంగిరెడ్డి సూచించారు. గురువారం ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగుల తొలివిడత శిక్షణా కేంద్రానికి ముఖ్యఅతిధిగా సీఐ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహత్మగాంధిజి ఆశయాలను అమలు పరిచే గ్రామ స్వరాజ్య పాలన ప్రస్తుతం యువత చేతికి ప్రభుత్వం అప్పగించిందన్నారు. ఇలాంటి మహాత్తర కార్యక్రమానికి మనరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఆ కార్యక్రమాన్ని అమలు చేసే బాధ్యత పుంగనూరు నుంచి మంత్రిగా ఉన్న డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఉందన్నారు. ఈ సచివాలయ వ్యవస్థను పుంగనూరు నుంచి పటిష్టంగా అమలుపరుస్తూ , పేద ప్రజల ముంగిటకు పరిపాలనను పారదర్శకంగా తీసుకెళ్లాలని కోరారు. ముఖ్యంగా సచివాలయానికి వచ్చే ప్రజలను చిరునవ్వుతో పలకరించాలని , ఆవేశాలకు లోనుకారాదన్నారు. ప్రజలకు అన్ని విషయాలను వలంటీర్లతో కలసి తెలియజేసి, సంతృప్తి పరచి పంపాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పనితీరు తలమానికంగా నిలవాలని కోరారు. ఈ శిక్షణలో ఏఈ సుబ్రమణ్యంరెడ్డి, ఏపివో సుట్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

నవరత్నాలను అందించడమే ప్రభుత్వ ఆశయం

Tags: Discipline is important for ministry employees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *