Date:08/11/2019
అసిఫాబాద్ ముచ్చట్లు:
కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టాన శ్రీ లక్ష్మి నర్సింగ్ హోం నందు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలోలో నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో నిర్వహించే ,ప్రపంచ మధుమేహ వ్యాది నివారణ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా లయన్ రిజినల్ చైర్ పర్సన్ డా. కొత్తపల్లి శ్రీనివాస్ మరియు లయన్ జోనల్ చైర్ పర్సన్ డా. కొత్తపల్లి అనిత పాల్గొన్నారు. ముందుగా ప్రపంచ మధు మేహ వ్యాది నివారణకై కరపత్రాలు ఆవిష్కరించారు ,ఈ కార్యక్రమంలో బాగంగా మధుమేహ పరిక్షకు సంబంధించిన కిట్స్ ,స్ట్రిప్స్ అందించారు.
అనంతరం అయన మాట్లాడుతూ ఎంతో మంది ప్రజానీకాన్ని బయపెడుతున్న మహమ్మారి మధుమేహం పై లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ యుద్ధం ప్రకటించి ప్రత్యేక కార్యాచరణ రూపొందింఛి ఈ వ్యాధి నివారణ దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని మధుమోహ మహమ్మారి పై అవగాహన సదస్సులు నిర్వహించి వ్యాధి నిర్ధారణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రతిఒక్కరికి మధుమేహం పట్ల సరైన అవగాహనా కల్పించి వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త వహించాలనే లక్ష్యం తో ప్రపంచ వ్యాప్తంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో వ్యాధి నిర్మూలన కర్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మధు మెహ వ్యాధి జిల్లా సమన్వయ కర్త కోదండరామ్ , ఇన్నర్ కాబినెట్ మెంబర్ సత్యనారాయణ ,లయన్స్ క్లబ్ డైరెక్టర్ పేరుమల్లు.వెంకట్ ,రోచాక్ అగర్వాల్ ,లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ జావార్ ,కోశాధికారి మాచర్ల .శ్రీనివాస్ మరియు రతన్ జైన్, పాల్గొన్నారు.
Tags:Discovery of pamphlets for the prevention of global diabetes