కార్పొరేట్ స్కూల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు.

పుంగనూరు ముచ్చట్లు:


విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే కార్పొరేట్ స్కూల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని  AISF చిత్తూరు జిల్లా కో కన్వీనర్ మున్నా తెలిపారు . ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కార్పొరేట్ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేయాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. గత ఏడాది కంటే అధికంగా ఫీజులు పెంచేశారు. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తే ఆందోళనలు చేపడతాం.

నోటీసు బోర్డులో పెట్టాలి…

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులు ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. అయితే ఎక్కడా పెట్టడం లేదు. రూ: లక్షల కొద్ది ఫీజులను తల్లిదండ్రుల నుంచి వసూలు చేసుకుంటున్నారు. ఇవి తెలిసిన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా మీనామేషాలు లెక్కిస్తున్నారు.

 

Tags:Discretionary Fees in Corporate School.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *