తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష-స్పష్టమైన ప్రశ్నలు

Discrimination-clear questions about Telangana

Discrimination-clear questions about Telangana

Date:07/01/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రం తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష పై స్పష్టమైన ప్రశ్నలు సంధించారు. అయన కె.టి.యార్  ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా ఎంపీ బండారు దత్తాత్రేయ నోటికొచ్చినట్టు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని ఎమ్మెల్సీలు కర్నే ప్రభాకర్, ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. సోమవారం వారిద్దరూ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. .మాజీ మంత్రి దత్తాత్రేయ పై మాకు సానుభూతి ఉంది. తెలంగాణ బిడ్డను మంత్రి వర్గం నుంచి తప్పించినందుకు బాధ పడ్డాం. కనీసం మంత్రి వర్గం నుంచి బయటకు వచ్చాక అయినా తెలంగాణ ప్రయోజనాల కోసం మోడీ పై దత్తాత్రేయ ఒత్తిడి తెస్తే హర్షించేవాళ్ళం. తెలంగాణ హక్కుల వైపు నిలబడాల్సిన దత్తాత్రేయ కేంద్రం అంతా చేసిందని మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. తెలంగాణ కు 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాము అని అమిత్ షా చెప్పినపుడు సీఎం కెసిఆర్ ఆధారాల తో సహా ఖండించారు. దత్తాత్రేయ పాడిందే పాడరా అన్నట్టుగా అమిత్ షా పాటనే మళ్లీ పాడారు. .మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  మాట్లాడిన దానిఫై సరైన వివరణ ఇవ్వకుండా దత్తాత్రేయ గాలి మాటల తో విమర్శలకు దిగడాన్ని ఖండిస్తున్నాం.
బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని దత్తాత్రేయ వ్యాఖ్యలు మరోమారు నిరూపించాయి. తమకార్యాలయం పై బీజేపీ పేరు ను మార్చి కొత్త  బోర్డు తగిలించుకోవాలని వారు సూచించారు. నీతి ఆయోగ్ మిషన్ కాకతీయ , మిషన్ భగీరథ లకు 24 వేల కోట్ల రూపాయలు సాయం చేయాలని ప్రతిపాదించినా కేంద్రం ఎందుకు తిరస్కరించిందో చెప్పాలని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. .కేంద్రమంత్రి మేఘవాల్ నీతి ఆయోగ్ సిఫారసు ను తిరస్కరించామని పార్లమెంటు వేదిగ్గా చెప్పినందుకు దత్తాత్రేయ సహా తెలంగాణ బీజేపీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలి. తెలంగాణ లో బీజేపీ శాఖ ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకున్నా దత్తాత్రేయ వత్తాసు పలికేలా స్పందించడం దురదృష్టకరమని వారు వ్యాఖ్యానించారు. సీఎం కెసిఆర్, మా ఎంపీ లు పలు దఫాలుగా ఒత్తిడి చేస్తే గానీ ఎయిమ్స్ లాంటి సంస్థలు తెలంగాణ కు రాలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన కు కేంద్రం ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదనే దత్తాత్రేయ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. రాష్ట్రానికి ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు రావాల్సిన నిధుల కన్నా అదనంగా ఒక్క పైసా నైనా కేటాయించారా ?  24 గంటల విద్యుత్ సరఫరా కేంద్రప్రభుత్వం ఘనతే అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాన్ని ఎందుకు అమలు చేయలేక పోతున్నారో దత్తాత్రేయ చెప్పాలని అన్నారు. రైతు బంధు ,రైతు బీమా .
రుణమాఫీ లాంటి చర్యలతో వ్యవసాయానికి ఊతం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఉదారంగా సాయం చేయాల్సిన భాద్యత కేంద్రప్రభుత్వం మీద లేదా ? తెలంగాణ నుంచి అగ్రభాగాన పన్నుల వాటా పొందుతున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పథకాల కు సాయం చేయాల్సిన కనీస భాద్యత లేదా ? తెలంగాణ కు విభజన చట్టం కింద న్యాయం గా రావాల్సిన అంశాల పై తెలంగాణ బీజెపి నేతలు నోరు మెదప రెందుకు ? సాగు నీటి ప్రాజెక్టులకు సాయం విషయం లో తెలంగాణ పై శీత కన్ను దేనికి ? .బీజేపీ పాలిత రాష్ట్రాలకు అడగకుండనే సాయం చేస్తున్న కేంద్రానికి తెలంగాణ డిమాండ్ల పై స్పందించక పోవడం నేరం కాదా అని ప్రశ్నించారు. కేంద్ర సాయం పై బీజేపీ నేతలు అబద్దాల తో కూడిన పుస్తకాలు ఎన్ని వేసినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. .దత్తాత్రేయ వేసే అబద్దపు పుస్తకం పై చర్చకు సిద్ధంగా ఉన్నాం. చర్చ ఎక్కడో నిర్ణయిస్తే దత్తాత్రేయ స్థాయి కి తగ్గ నాయకుడిని పంపిస్తాం. తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్ష కు బీజేపీ నేతలు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. తెలంగాణ కు అన్యాయం చేస్తున్న బీజేపీ నేతలకు ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం. ఓటమి తో గుణపాఠాలు నేర్చుకోకుండా తెరాస  పై ఎదురుదాడికి దిగితే బీజేపీ నేతలకు తగిన సమాధానం లభిస్తుందని వారన్నారు.
Tags:Discrimination-clear questions about Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *