గవర్నర్ ల పాత్రపై చర్చ జరగాలి :   రేవంత్ రెడ్డి 

Date:16/05/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్ల పాత్ర పై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సంపూర్ణ మెజార్టీ రానప్పుడు గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. గోవా లో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా బిజెపి కి అవకాశం ఇవ్వటం దారుణమని అన్నారు. మణిపూర్, మేఘాలయ ల్లో ఎన్నికల తర్వాత ఏర్పాటైన కూటములకు గవర్నర్లు అవకాశం ఇవ్వలేదా అని అయన ప్రశ్నించారు. సర్కారియా కమిషన్ సిఫార్సుల ప్రకారం 1.పూర్తి మెజార్టీ, 2.ఎన్నికల ముందు ఏర్పాటైన కూటమి మెజార్టీ సాధిస్తే, 3. ఎన్నికల తరువాత కూటమి ఏర్పాటైన తర్వాత మెజార్టీ… 4. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అయన సూచించారు. భారత రాజ్యాంగం పైన మోడీ, అమిత్ షా లకు నమ్మకం ఉందా అని అయన అన్నారు. అఖండ భారత్ , సంప్రదాయాలు రక్షించే వారిగా ముద్ర వేసుకున్న వారు… పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. నైతిక విలువల గురించి మాట్లాడే వారు…. ఎమ్మెల్యేల కొనుగోళ్ళకు మద్దతిస్తారా. సంప్రదాయాలు మీకు అనుకూలంగా మార్చుకుంటారా అని అడిగారు. ఫిరాయింపులను పరోక్షం గా గవర్నర్ ప్రోత్సహిస్తున్నారు. కర్నాటకలో తక్షణం కాంగ్రెస్ – జేడీఎస్  కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని అన్నారు. ఆనాటి భారతీయ జనతీయ జనతా పార్టీ వేరు. ఇప్పటి బీజేపీ వేరు. ఒక్క ఓటుతో వాజపాయి ప్రభుత్వాన్ని కోల్పోయింది. అవకాశం ఉన్నా అద్వానీ, వాజపాయి లు అక్రమ మార్గాల వైపే చూడలేదని అయన అన్నారు. మోడీ, షా బీజేపీ ని చెర బట్టారు. ఫిరాయింపులు, అధికార కాక్ష తో అక్రమ మార్గాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయని ఆరోపించారు. జేడీఎస్ కు మద్దతిచ్చిన కేసీఆర్,  జేడీఎస్ ఏ పార్టీతో వెళ్లాలని చెప్తారో చెప్పాలని అన్నారు. కర్ణాటకలో జరిగిందే రేపు దేశంలో జరుగుతుంది. అప్పుడు కేసీఆర్ ఎటువైపో తేల్చుకోవాలని అన్నారు. భారత్ అనే నేను సినిమాలో .. భారత్ రామ్ పెరు మార్చినందుకు … కేటీఆర్ డబ్బులిచ్చాడు. వచ్చే ఎన్నికల తర్వాత  కేటీఆర్ యాంకరింగ్ చేసుకోవాల్సిందేనని రేవంత్ వ్యాఖ్యానించారు.
Tags: Discussion on the role of governors: Revant Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *