మతపెద్దలతో చర్చ జరగాలి

Date:23/09/2020

విజయవాడ ముచ్చట్లు

సీఎం జగన్ తిరుమలలో డిక్లెరేషన్ ఇవ్వాల్సిన అవసరంలేదు. బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుంటే టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. శ్రీవారిపై భక్తి ఉంటేనే తిరుమలకు వచ్చి దర్శించుకుంటారని మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ అన్నీ మతాలకు చెందిన వ్యక్తి. ఆలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్తారు. అందరినీ సమానంగా పరిపాలిస్తానని ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. అన్యమతస్తులు సంతకాలు చేయాలనే నిబంధనపై మతపెద్దలు, స్వామీజీలతో చర్చ జరగాలని అయన అన్నారు. వేంకటేశ్వరస్వామిని రాజకీయాలకు వాడుకునే దరిద్రపు సంస్కృతి వచ్చింది. చంద్రబాబు చర్చికెళ్లి 23వ కీర్తన పాడాడు, అందుకే 23 సీట్లు వచ్చాయి. నేను శ్రీవారికి పరమభక్తుడుని, దేవుడిని అడ్డంపెట్టుకునే డబ్బులు సంపాదించే ఉద్దేశం మాకులేదు. బీజేపీ చెబుతున్న భార్యతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించాలనే నిబంధన ప్రధానిమోదీకి చెప్పండని అయన అన్నారు.

 

మావోయిస్టు వారోత్సవాల నేపధ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు 
Tags:Discussion should take place with the clergy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *