మంత్రివర్గ విస్తరణ పై తర్జన భర్జనలు

Discussions on cabinet expansion

Discussions on cabinet expansion

Date:09/10/2018
విజయవాడ  ముచ్చట్లు:
ఏపీలో మైనార్టీలకు, గిరిజనులకు మంత్రి పదవి ఇస్తారని, ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని, మంత్రులశాఖల్లో భారీ మార్పులు, చేర్పులు జరుగుతాయని  ఊహాగానాలు వెల్లువెత్తిన విషయం విదితమే. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదని సమాచారం. మంత్రివర్గ విస్తరణ అసలు చేస్తారా..? లేదా అనేదానిపై ఆయన మనసులో ఏముందో బయటకు వెల్లడి కావడం లేదట. మంత్రివర్గ విస్తరణ జరిగితే రోడ్లు,భవనాలశాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు మాజీ అయ్యేవారు. అదే విధంగా ఎక్సైజ్‌ మంత్రి జవహర్‌తో పాటు పలువురు మంత్రుల శాఖలు మారేవి. మళ్లీ ఎప్పుడు ‘చంద్రబాబు’ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపడతారో తెలియదు కానీ..అదెప్పుడు జరిగాలా..అంటూ పడిగాపులు కాస్తున్నారు.
ముస్లిం,మైనార్టీల కోసమే మంత్రివర్గ విస్తరణ చేయాలని భావించిన ‘చంద్రబాబు, గిరిజనులకు, మహిళలకు ప్రాధాన్యత పెంచాలనే దానిపై చర్చించిన ఆయన దానిపై తరువాత నోరు మెదపడం లేదు. మంత్రివర్గ విస్తరణ గురించి ‘చంద్రబాబు’ వ్యవహారశైలి ఎలా ఉందంటే ‘రోశయ్య’ ముఖ్యమంత్రి అయిన తరువాత అదుగో..మంత్రివర్గ విస్తరణ..ఇదుగో మంత్రివర్గ విస్తరణ అంటూ చివరకు ముఖ్యమంత్రి పదవినే పోగొట్టుకున్నారని టిడిపి ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి వ్యంగ్యంగా విమర్శలు చేశారు. రోశయ్య ముఖ్యమంత్రి నుంచి దిగిపోయిన తరువాత సిఎల్‌పి కార్యాలయానికి ‘రోశయ్య’ వచ్చినప్పుడు ‘నిన్ను నమ్ముకుని నాశనం…అయ్యాం..వై.ఎస్‌ మంత్రి పదవి ఇవ్వకుండా పోయారు..నీవు ముఖ్యమంత్రి అయిన తరువాత మంత్రి పదవి వస్తుందని భావించా..?
కానీ..మీరు మాజీ అయ్యారు..ఆయనకో..దండం…మీకో దండం అంటూ…’జెసి’ అప్పట్లో వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం..టిడిపి అధినేత పరిస్థితి కూడా అదే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మంత్రివర్గ విస్తరణకు ‘చంద్రబాబు’ భయపడుతున్నారా..? మైనార్టీల్లో పెద్దగా మార్పు లేదని ఆయన భావిస్తున్నారా..? లేక ఎందుకు కందరీగతెట్టెను కదిలించడం అన్నట్లు గుంభనంగా వ్యవహరిస్తున్నారా? అనే విషయం…ఆయన కుమారుడులోకేష్‌ కానీ…ఇతర మంత్రులకు కానీ…సిఎంఒ వర్గాలకు కానీ తెలియడం లేదట. అయితే ‘దసరా’కు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొందరు నేతలు అంటున్నారు. ఆయన విజయదశమి రోజున మంత్రివర్గ విస్తరణ చేస్తారని, సెంటిమెంట్‌ ప్రకారం అప్పుడే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే…ఒకరిద్దరికి మంత్రి పదవి పోవడం ఖాయమని అంటున్నారు మరి ఏం జరగనున్నదో వేచి చూడాల్సిందే మరి.
Tags:Discussions on cabinet expansion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed