రేవంత్ క్రెడిబులిటీపై చర్చోపచర్చలు

హైదరాబాద్ ముచ్చట్లు:

రేవంత్ రెడ్డి అరుపులు..విరుపులు ఓట్లు తెచ్చిపెడతాయా? అసలు రేవంత్ రెడ్డి ఎంపికను ఏఐసీసీ ఎలా చేసింది? ఆయనలో ఏ ప్లస్ లు కన్పించాయి? ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఊహించని విధంగా రేవంత్ రెడ్డి నియామకం వెనక ఏం జరిగిందన్న దానిపై అనేక మంది సీనియర్ నేతలు సయితం ఆరా తీస్తున్నారట. అయితే కేవలం ఆసక్తితోనేనని చెబుతున్నారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతూనే ఏం జరిగిందన్ దానిపై ఢిల్లీలో తమకు పరిచయమున్న నేతల ద్వారా సమాచారం సేకరించే పనిలో పడ్డారు.నిజానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి వస్తుందని సీనియర్ నేతలు ఎవరూ ఊహించలేదు. మూడున్నరేళ్ల క్రితమే పార్టీలో చేరడం, దూకుడు స్వభావం, క్రెడిబులిటీ లేకపోవడం వంటి కారణాలతో రేవంత్ రెడ్డిని పక్కన పెడతారని అందరూ భావించారు. సీనియారిటీ, సిన్సియారిటీని చూస్తారనుకున్నారు. కానీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ లోని 70 శాతం మంది నేతలను విస్మయానికి గురి చేసిందనే చెప్పాలి.రేవంత్ రెడ్డికి క్రెడిబులిటీ లేదు. ఆయన ఒక నియోజకవర్గానికి నాయకుడే కావచ్చు కాని రాష్ట్రస్థాయి నేత కాదన్నది సీనియర్ల ఒపీనియన్. రేవంత్ రెడ్డిపై అనేక కేసులు ఉన్నాయి. భూ వివాదాలున్నాయి. సహజంగా పీసీసీ అధ్యక్షుడంటే కాబోయే ముఖ్యమంత్రిగానే చూస్తారు. అలాంటిది కొత్త రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి చేతుల్లో పెట్టేందుకు వచ్చే ఎన్నికల్లోనైనా ప్రజలు మొగ్గు చూపుతారా? అన్నది కష్టమేనని ఒక కాంగ్రెస్ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.రేవంత్ రెడ్డి డైలాగులు బాగానే ఉండవచ్చు. ప్రజల్లోకి చొచ్చొకుని వెళ్లవచ్చు. కానీ క్రెడిబులిటీ లేని నాయకత్వానికి ప్రజలు రాష్ట్రాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉండరన్న విశ్లేషణలు కాంగ్రెస్ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి ఘోరమైన తప్పిదం చేసిందని, రేవంత్ రెడ్డి ప్రయోగం విఫలం కాక తప్పదని విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి నియామకంతో పార్టీకి వచ్చిన హైప్ తాత్కాలికమేనన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి.
కొండా రీ ఎంట్రీ
కొన్నిసార్లు అంతే తాము అనుకున్నవి రాజకీయాల్లో తారుమారవుతుంటాయి. తాము ఊహించని విషయాలు జరుగుతాయి. అంచనాలు కూడా తారుమారవుతాయి. సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన ఆయన అక్కడ ఇమడ లేక పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.కొండా విశ్వేశ్వర్ రెడ్డి బలమైన నాయకుడు. ఆయన ఆర్థికంగా, సామాజికంగా ప్రభావితం చేయగలిగిన నేత. ఆయన కుటుంబ నేపథ్యం కూడా అదే. అలాంటి నేత కాంగ్రెస్ లో ఎక్కువ కాలం ఇమడలేక పోయారు, గ్రూపు తగాదాలకు విసిగిపోయారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల అని భావించారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే తమ రాజకీయ జీవితం కూడా నాశనం అవుతుందని భావించి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు.కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి రేవంత్ రెడ్డికి మద్దతదారు. టీఆర్ఎస్ లో 2014లో గెలిచి అక్కడ కేసీఆర్ తీరుకు హర్ట్ అయి బయటకు వచ్చారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి అయితేనే బెటర్ అని ఆయన నమ్మేవారు. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ రాదన్నది ఆయనకు అర్థమయి బయటకు వచ్చారంటారు. కాంగ్రెస్ లో బలమైన లాబీయింగ్ పనిచేస్తుందని భావించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కదనే అనుకున్నారు.కానీ కాంగ్రెస్ ను వీడినా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏ పార్టీలో చేరలేదు. హుజూరాబాద్ లో మాత్రం ఈటల రాజేందర్ కు మద్దతిస్తానని అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో ఆయన మనసు మారిందంటున్నారు. తిరిగి కాంగ్రెస్ వైపు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. త్వరలో రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని కలసి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలిసింది. మొత్తం మీద కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఖాయమంటున్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Discussions on Revant Credibility

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *